బీజేపీ నాయకురాలు విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 24 ఏళ్లైంది. 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, బీజేపీ అగ్రనేత అద్వానీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఉన్న ఫొటోను ఆమె జత చేశారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. సినీనటిగా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె తొలుత బీజేపీలో చేరారు. ఆ తర్వాత సొంతంగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేశారు. టీఆర్ఎస్ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌గా పనిచేశారు.


ఇటీవలే తిరిగి బీజేపీ గూటికి చేరారు. ఓ వైపు సినిమా రంగంలో కొనసాగుతూనే 1998లో ఆమె బీజేపీలో చేరారు. 2005లో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కమలం పార్టీని వీడి ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించారు. కొంతకాలానికే తన పార్టీని టీఆర్‌ఎ్‌సలో విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి గెలుపొందారు.  2012 నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌తో విభేదాలతో టీఆర్‌ఎ్‌సకు దూరంగా ఉన్నారు. 2013లో ఆ పార్టీని వీడిన రాములమ్మ.. తెలంగాణ ఆవిర్భావం అనంతరం కాంగ్రె్‌సలో చేరారు. 2014 ఎన్నికల్లో మెదక్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ రాజకీయాలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు. 2018లోనూ పోటీ చేయాలని పార్టీ శ్రేణులు ఒత్తిడి తెచ్చినా ఆమె ససేమిరా అన్నారు.


ఇక సినీ జీవితం విష‌యానికి వ‌స్తే తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "ద లేడీ సూపర్ స్టార్", "లేడీ అమితాబ్" గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది.ఆమె 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.  ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. ఆమె నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: