తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మీద ఎక్కువగా దృష్టి సారించింది. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చర్యలు చేపడుతుంది. ఇక ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మండలం బాట సింగారం లో మరో లాజిస్టిక్‌ పార్కు సిద్ధం చేసారు. బాటసింగారంలో సకల హంగులతో..  నేడు మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. దీనితో మరో లాజిస్టిక్‌ పార్కు అందుబాటులోకి రానుంది. అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం బాటసింగారంలో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన పార్కును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభిస్తున్నట్టు మంత్రి వివరించారు.

ఇప్పటికే మంగళ్‌ పల్లి లాజిస్టిక్‌ పార్కు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నగరంలో రోజు 30వేలకు పైగా సరకు రవాణా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. లక్ష టన్నుల బరువుల గల వస్తువులను ఎగుమతి, దిగుమతి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకే సరకు రవాణా వాహనాలను నగరంలోకి అనుమతిస్తున్నట్టు అధికారులు వివరించారు. పగలు శివారులో పార్కింగ్‌ చేసుకోవాల్సి వస్తోందని...

ఇబ్బంది రాకుండా హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్‌ చుట్టూ పీపీపీ పద్ధతిలో లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. తొలి దశలో మంగళ్‌ పల్లిలో 22 ఎకరాలు, బాటసింగారంలో 40 ఎకరాల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. రూ.35కోట్లతో 40ఎకరాల్లో విస్తరించిన లాజిస్టిక్‌ పార్కులో 500 ట్రక్కులు నిలిపేలా స్థలం ఉంటుంది. 2 లక్షల చ.అడుగుల్లో గోదాంలు, 10వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో శీతల గిడ్డంగులు, డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేలా సౌకర్యాలు రెస్టారెంట్స్‌, పెట్రోల్‌ పంపు ఉంటాయి అని అధికారులు వెల్లడించారు. ఈ పార్కుల వల్ల నగరంపై ట్రాఫిక్‌ ఒత్తిడి, కాలుష్యం తో పాటు రోడ్డు ప్రమాదాలూ తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: