ఎన్నికల వేళ ఎన్నికల సంఘానికి సార్వబౌమునికి ఉండే అపరిమిత అధికారాలుంటాయి. ఉదాహరణకు బాలెట్ పాపర్ మీద నచ్చిన అభ్యర్ధి గుర్తుపై స్వస్తిక్ ముద్రవేసి బాలెట్ లో పాల్గొంటారు ఓటర్లు. అది అసలు ఎన్నికలలో ఎన్నుకొనే విధానం. కాని ఈ మధ్య తెలంగాణా ఎన్నికల కమీషణర్ పెన్నుతో టిక్ చేసినా వోటేసినట్లేనని రూలింగ్ ఇచ్చారు. నిజంగా అక్కడ రిగ్గింగ్ జరిందని బలంగా చెపుతునారు. ఎలా చేసినా ఎన్నికల కమీషనర్ నిర్ణయమే ఫైనల్ అని సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. ఇది చాలదు ఎస్ఈసి అధికారాలేమిటో చెప్పటానికి.

ఎస్ఈసి నిమ్మగడ్డ రమెష్ కుమార్ వర్సెస్ ఏపి సీఎం జగనోరు - మధ్య ఇగో పోరులో చాలా కాలం జగనోరు తన ప్రతాపం చూపినా, చివరికి "ఒక రోజు ప్ర‌తి ఒక్క‌రికీ తనదౌతుందని" అంటారు. కాని ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డకు ఒక రోజు కాదు 66 రోజులు తనవే అయ్యాయి. "66 రోజుల సమయం దొరికింది, జగనోరుతో బౌలింగ్ చేయటానికి మాత్రమే కాదు, బాటింగ్  కూడా తాను చెప్పినట్లే జగనోరు చెయ్యాలి" అన్నట్లుంది. అదీ నేడు జగనోరి దీన స్థితి.

విధానాలు వదిలేసి గుడ్డిగా జగనోరికి సహకరించిన అధికార్లకు దాదాపు అదే దుర్గతి పట్టింది.  నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయ్యేవరకు జగనోరి పరిస్థితి "ఇంతే సంగతులు చిత్తగించగలరు" అన్నట్లే ఉంటుంది. ఫిబ్ర‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు పూర్తవగానే, తర్వాత వాయిదా ప‌డిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని నిమ్మ‌గ‌డ్డ చాలా  ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

నిమ్మ‌గ‌డ్డ‌ ఇప్పుడు జగనోరికి ఆయన ప్రభుత్వానికి లక్ష్మణ గీత గీసి,  బరిలో నిలబెట్టి ఆట ఆడేస్తుంటే ఆట పూర్తిగా 'వార్ – ఒన్ - సైడ్' అయింది. ఇప్పుడు నిమ్మగడ్డ ఆడిందే ఆట పాడిందే పాట. చేయి తిరిగిన ఆటగాడు లాగా, నిమ్మ‌గ‌డ్డ ఆడుుతుంటే జగనోరు ఆయన ప్రభుత్వం కూడా చేష్ట‌లుదక్కి దిక్కులు చూడవలసిందే.  

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లు పెట్టిన తొలి రెండు రోజుల్లోనే జగనోరి ప్ర‌భుత్వానికి నిమ్మ‌గ‌డ్డ షాకుల మీద షాకులు ఇవ్వటం మొదలెట్టారు. జగనోరి ప్ర‌భుత్వానికి గొంతులో, పచ్చి యెలక్కాయ పడింది. దాన్ని ఆయన క‌క్క‌లేరు, మింగలేరు అన్నట్లు ఉంది రగిలిపోతున్నా లోప‌లే ర‌గిలిపోవాలి తప్ప బయటపడేది ఏమీ ఉండదు.

ఆయన ఎస్ఈసీ అన్న విషయం మరిచిపోయి, రోద్-సైడ్ పనిలేని పిల్లాడులా  నిమ్మ‌గ‌డ్డే గదా అనుకొంటూ, ఆట లౌక్యం తెలియకుండా ఎదుటోడి అనుభవం చూడకుండా ఆడేశాదు. నిమ్మగడ్డ పట్ల జ‌గ‌నోరి స్వీయ త‌ప్పిదాలు మామూలుగా లేవు. ఆ జగనోరి తప్పిదాలకు తాను అనుభవించిన వేదన నిమ్మగడ్డ ఇప్పుడు జగనోరికి రుచి చూపిస్తారిక. ఆ ఫ‌లితాల‌ను జగనోరు ఇప్పుడు అనుభ‌వించాల్సి వ‌చ్చింది.

పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లను బదిలీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తిర‌స్క‌రించి మొద‌టి గట్టి షాక్ ఇచ్చారు. ఆ ఇద్దరిపై ‘సెన్స్యూర్’ పేరిట ఒక్క సంవత్సర కాలం పాటు ఒక ఉద్యోగికి రావలసిన ప్రమోషణ్లు తదితర ప్రయోజనాలను ఆపెయ్యటమే. దానికి తోడు ఇప్పుడు బ‌దిలీ చేయ‌డంతో పాటు “అభిశంసన’ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అది ఇప్పుడు సర్వీస్ రిజిస్టర్ లొ పొందుపరుస్తారు. వాటి ఫలితాలు జీవిత కాలం ఇబ్బంది కలిగిస్తాయి

ఈ శిక్షకు కారణంగా, గ్రామ పంచాయతీలవారీగా, ఓటర్ల జాబితా తయారీలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విధి నిర్వహణలో విఫలమై నట్లుగా వారి సర్వీసు రికార్డులో నమోదు చేయాలని ఆదేశించారు .

అయితే నిమ్మగడ్డ వెనుక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారని, అందుకే గతంలో ఎన్నికల కమీషనరుగా గోపాల కృష్ణ ద్వివేది తో ఆయనకున్న విభేదాలకు ఇందుమూలంగా, నిమ్మగడ్డ  కక్షతీర్చి గురుదక్షిణ చెల్లించుకున్నారని జనం అంటుంటే - జగనోరి బృందం మాత్రం కుల ఋణం తీర్చుకుంటున్నారని అంటున్నారు.  

ఇంత‌టితో నిమ్మ‌గ‌డ్డ ఆట ఆగ‌లేదు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లుగా కొత్త వారిని నియమించేందుకు వీలుగా ముగ్గురు చొప్పున అధికారుల ను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానల్‌ ను నిమ్మగడ్డ తిరస్కరిస్తూ సీఎస్‌కు లేఖలో వివరించారు.  బహుశ ఆ జాబితాలోని వారిపై విజిలెన్స్‌ కేసులు ఉండి ఉంటాయి అందుకే విజిలెన్స్‌ కేసుల్లేని వారి జాబితా మాత్రమే పంపాలని వివరించారు. అంతవరకు వరకు వారి బాధ్యతలను ఆయా జిల్లాల బాధ్యతను జాయింట్‌ కలెక్టర్లకు ఇవ్వాలని నిమ్మగడ్డ ఆ లేఖలో పేర్కొన్నారు.

మ‌రోవైపు  ఎస్ఈసీ ఆదేశాల మేర‌కు గుంటూరు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్, చిత్తూరు  కలెక్ట‌ర్‌ నారాయణ్‌ భరత్‌ గుప్తాలతో పాటు తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేశ్‌ రెడ్డిలను సాధారణ పరిపాలన శాఖకు సరెండర్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్  ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పుడు  “ఇంటింటికి రేష‌న్ పంపిణీ” సంక్షేమ పధకం విష‌య‌మై ప్రత్యెకంగా వివ‌ర‌ణ సమర్పించాలని సీఎస్‌కు నిమ్మ‌గ‌డ్డ లేఖ రాశారు.  ఇగో విషయంలో జగనోరికి మొగుడనటంలో అనుమానం లేని నిమ్మగడ్డకు భవిష్యత్ లో జ‌గ‌నోరికి, ఆయన ప్రభుత్వానికి ఊహకందని వాతలు పెట్టే అవకాశాలను అద్భుత వ్యూహంతో నిమ్మగడ్డ వదులుకోరని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం.

నిమ్మగడ్డ పని విధానం చూస్తే జగనోరికి “తదిగిణతోం” తప్పదని విజ్ఞుల అభిప్రాయం. నిమ్మగడ్డ మాజీ ముఖ్యమంత్రితో ఉన్నమైత్రితో అత్యుత్సాహంలో చేసే విన్యాసాలపై జగనోరు ఓ కన్నెసి రెడ్-హాండెడ్ గా పట్టుకోగలిగితే, "రాజ్యాంగం" సమస్యలోపడే అవకాశం ఉంటుంది. గతంలో తన సామాజికవర్గానికి చెంది, పార్టీలకు అతీతంగా నాయకులను, హయత్ హోటల్ లో కలిసిన చందంగా.....జగనోరూ! బెష్ట్ ఆఫ్ లక్.  




మరింత సమాచారం తెలుసుకోండి: