సీఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ అయ్యారు.  పీఆర్సీ కమిషన్ నివేదిక పై ఉద్యోగ సంఘాలతో సీఎస్ చర్చలు జరిపారు. 43% పీఆర్సీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 7.5% పీఆర్సీ కమిటీ సిఫారసు చేసింది. 31నెలలు కసరత్తు చేసినా ఉద్యోగుల సమస్యలు తీర్చే విధంగా కమిటీ రిపోర్ట్ లేదని సంఘాలు ఆరోపించారు. ప్రభుత్వానికి పలుమార్లు ఇచ్చిన డిమాండ్లు కూడా కమిటీ పరిగణలోకి తీసుకోలేదని ఉద్యోగ సంఘాలు అన్నాయి. త్రీమెన్ కమిటీ ముందు తమ డిమాండ్లను మరోమారు చెబుతామని నేతలు అంటున్నారు.

కాలయాపన లేకుండా వెంటనే తుది నిర్ణయం తీసుకోవాలని సీఎంను కొరతామంటున్నా ఉద్యోగు సంఘాలు... కీలక సమావేశం నిర్వహించాయి. ఇక పీఆర్సీపై సీఎస్ తో టిజీవో, టీఎన్జీవో సంఘాల సమావేశం ముగిసిన తర్వాత... పీఆర్సీపై ముఖ్యమంత్రి వద్దమే తేల్చుకుంటామని సీఎస్ కు తెలిపాం అని ప్రకటన చేసాయి. ఉద్యోగ సంఘాల నేత రాజేంద్ర మాట్లాడుతూ... 43శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎస్ ను కోరాం అని అన్నారు. పీఆర్సీపై రాజకీయ నిర్ణయం మాత్రమే జరగాలి అని స్పష్టం చేసారు.

పీఆర్సీ నివేదికను చెత్త బుట్టలో వేస్తున్నాం అన్నారు. ఎవరో కాదు.. ముఖ్యమంత్రి మాత్రమే పీఆర్సీపై నిర్ణయం తీసుకోవాలి అని వెల్లడించారు. 7.5శాతం పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు అని అన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రిని కలసి ఆమోదయోగ్యమైన పీఆర్సీని సాధిస్తాం అని స్పష్టం చేసారు. ఆర్థిక మాంద్యం మెరుగు పడిన తర్వాత కూడా ఉద్యోగులను చిన్న చూపు చూడటం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేసారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. వయోపరిమితి ఈనెల నుంచే అమలు చేయాలి అని డిమాండ్ చేసారు. గ్రాట్యుటీని 20లక్షలకు పెంచాలి అని కోరారు. ఏ పార్టీ అధికారంలో‌ ఉన్నా..  ప్రభుత్వంతో ఒకే రకంగా వ్యవహరిస్తాం అని పేర్కొన్నారు. సీఎం దగ్గర మాకు తలుపులు మూసుకుపోలేదు. తెగేదాక లాగం అన్నారు. లౌక్యం పనిచేయనప్పుడు ఏమి చేయాలో నిర్ణయిస్తాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: