విశాఖలోని రైల్యే  న్యూ కాలనీ, శ్రీ కన్య థియేటర్ ప్రక్కన ఉన్న ఇందిరా గాంధీ కాలనీ లో 30 లక్షల రూపాయలతో మౌలిక వసతులు కల్పించేందుకు శంకుస్థాపన చేసారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ కార్యక్రమానికి ఎంపీ ఎన్ వి సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఈ పరిస్థితికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్  కారణం అని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం అని స్పష్టం చేసారు.

మేము ఎన్నికలకు భయపడి కాదు, కరోనా నేపథ్యంలో  ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వ్యతిరేకించామని అన్నారు. రాష్ట్రంలో ఎవరికి ఆరోగ్య పరమైన గాని కరోనా పరంగా గాని ఇబ్బందులు వచ్చినా దానికి నిమ్మగడ్డ బాధ్యత వహించాలి అని స్పష్టం చేసారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఎస్ ఈ సి ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అని అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఏకలవ్య కాలనీ లో కూడా విజయసాయి రెడ్డి పర్యటించారు.

స్థానికులు సమస్యలు అడిగి తెలుసుకున్న విజయ సాయిరెడ్డి... తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇళ్ల పట్టాలతో సహా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు జగన్ అని అన్నారు. పరిపాలన రాజధాని  విశాఖలో ప్రతి సెంటు భూమి ఎంతో విలువైనది అని ఆయన స్పష్టం చేసారు. కోర్టు సమస్య పరిష్కారం అయిన తర్వాత ఇళ్ల కు సీఎం శంకుస్థాపన చేస్తారని ఆయన అన్నారు. ఏకలవ్య కాలనీ లో మౌలికవసతులుకల్పించడానికి 45 లక్షలు ఖర్చు అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. జీవీఎంసీ ని నిధులు కేటాయించాలని కోరుతున్నాను...సాధ్యం కాని పక్షం లో ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం పథకాల ప్రకారం అర్హులకు ఇల్లు కట్టించి ఇస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: