ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. మొన్న ఇద్దరు అధికారులపై వేటు వేశారు. వారి సర్వీస్ రికార్డుల్లో రిమార్కులు రాయాలని ఆదేశించారు. ఈ వివరాలు కేంద్రానికీ పంపారు. ఆ ఇద్దరు అధికారుల్లో ఒకరు గోపాలకృష్ణ ద్వివేదీ.. ఈయన పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి. అయితే ఈయనపై ఎస్‌ఈసీ ఆగ్రహానికి వేరే కారణం ఉందట. ఆ విషయాన్ని వైసీపీ నాయకులు బయటపెడుతున్నారు. ఇదే గోపాలకృష్ణ ద్వివేదీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌ ప్రతినిధిగా పని చేశారు.

వైసీపీ నేతలు చెప్పేదేమిటంటే.. “ గోపాలకృష్ణ ద్వివేది అనే వ్యక్తి రెండు మొట్లు పైన ఉండే వ్యక్తి. సెంట్రల్‌ ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటివ్‌గా పనిచేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్‌ ను పట్టుకుని మీరు ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారా అని అన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఎన్నికల కమిషన్ ఛాంబర్‌లోకి వెళ్ళి, ఎన్నికల కమీషన్ అంత పెద్దది అనుకుంటున్నారా అని మాట్లాడారు. అదే చంద్రబాబు ఈరోజు దైవదూషణలా.. ఎన్నికల కమీషన్‌ను దూషిస్తారా అని చంద్రబాబు అంటున్నారు. ప్రజలు ఏమనుకుంటారో.. అన్న విజ్ఞత లేకుండా చంద్రబాబు వ్యవహరించారు. అప్పుడు చంద్రబాబు ఎటాక్‌ చేస్తే.. ఇప్పుడు సహపాత్రధారి నిమ్మగడ్డ కూడా  ద్వివేదిని ఎటాక్ చేస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు.

మొత్తం మీద.. నిమ్మగడ్డ, చంద్రబాబు ఇద్దరిదీ ఒకే డీఎన్‌ఏ అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్‌ఈసీ ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని పిలుపు ఇవ్వాల్సిందిపోయి.. ఏకగ్రీవాలు ప్రోత్సహించాల్సింది పోయి.. ఏకగ్రీవం అంటేనే బూతులాగా.. ఒక్క ఓటు ఉన్నా నామినేషన్ వేయాలని చంద్రబాబు అనటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నాది కాకపోతే కొట్టుకు చావండన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని... గ్రామ స్థాయిలో అవసరాలు తీర్చడం కోసం అవసరమైన బాడీ ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఏకగ్రీవాలు ఇప్పుడు కొత్తకాదని.. 2013 ముందు నుంచి కూడా ఏకగ్రీవాలు జరిగాయని వైసీపీ నాయకులు వాదిస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీని ఎదుర్కోవాలంటే విధానపరంగా, ఫెయిల్యూర్స్‌ను చూపి ఎదుర్కోవాలి తప్ప.. లేకపోతే జనరల్ ఎన్నికల్లో, పార్టీ గుర్తు మీద వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదుర్కోవాలి. గ్రామ పంచాయితీ ఎన్నికలకు ముడిపెట్టడం ఏంటి? అదే కుట్రబుద్దితో మొన్న, నిన్న చంద్రబాబు ఐదు గంటలు మాట్లాడారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: