ఎన్నికలు వస్తే ఏపి రాజకీయాల్లో వేడి రాజుకుంటుందన్న సంగతి తెలిసిందే..ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనపడుతుంది.ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి.రాష్ట్రంలో నాలుగు విడుతలుగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవాలుగా మార్చాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. అలా జరగకుండా అడ్డుకునేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ వ్యూహరచన చేస్తున్నారు.. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నాలో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇద్దర్నీ కలిపి కూర్చొబెట్టేందుకు గవర్నర్‌ ప్రయత్నిస్తున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. 



ఎన్నికల నిర్వహణలో భాగంగా నిన్న గవర్నర్‌ను ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ కలిసిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి, ఎస్ఈసీకి వారదిగా ఉంటానని గవర్నర్ హరిచందన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం, ఉద్యోగుల పాత్రపై గవర్నర్ నిర్మాణాత్మక సూచనలు చేశారన్నారు. ఆ సూచనలను సానుకూల దృక్పథంతో స్వీకరించి ఎన్నికలను విజయవంతం చేయాలని భావిస్తున్నట్లు నిమ్మగడ్డ వెల్లడించారు. గత సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పటి నుంచి నిమ్మగడ్డపై అధికారపార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 



ఈ విషయం పై వైసీపీ నేతలు కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే మంత్రులు, వైసీపీ నేతలు మాత్రం సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని చెబుతూనే.. మరోవైపు నిమ్మగడ్డ పై నిప్పులు చెరుగుతున్నారు. చల్లగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడానికి నిమ్మగడ్డ నే కారణమంటూ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడితే నిమ్మగడ్డనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు తొత్తని ఆరోపించారు. చంద్ర బాబు చేతిలో నిమ్మగడ్డ కీలు బొమ్మలా మారాడు. అతని ప్రయోజనాలా కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఎంపి ద్వజమెత్తారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను రిటైర్డ్‌ అధికారంటూ పదేపదే పెద్దిరెడ్డి సంబోధించడం ఆశ్చార్యానికి గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య సయోథ్యకు గవర్నర్ రాయబారం ఎంతమేరకు ఫలిస్తుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: