రోజురోజుకు సర్కారు బడుల ప్రాముఖ్యత తగ్గిపోతుంది అన్న విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు అస్సలు ఇష్టపడటం లేదు.  ఇక ప్రైవేటు పాఠశాలల్లో చదివించడం కారణంగా ఇంగ్లీష్ మీడియం బోధన తో తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఎంతగానో చర్చించిన ప్రభుత్వం చివరికి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం బోధన తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే.


 అయినప్పటికీ ఎక్కడ మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు తీరు  లో మాత్రం మార్పు రావడంలేదు. అయితే..  సాధారణంగా విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు  మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారు. తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి అని కోరుకుంటున్నారు  తప్పా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి అని మాత్రం ఎవరూ కోరుకోవడం లేదు.  ఇక ఎప్పుడైనా పలు సమావేశాల్లో ప్రసంగాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి  తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని గొప్ప గొప్ప మాటలు చెబుతున్నారు తప్ప వారి పిల్లలను  మాత్రం మంచి ప్రైవేట్ స్కూళ్లలో  చదివిస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇటీవలే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలనే  విధంగా చర్యలు తీసుకోవాలి అని వేతన సవరణ సంఘం సూచించింది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తెరిచినప్పటికీ కూడా ఎక్కువమంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించేందుకే  మొగ్గు చూపుతున్నారని తద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత తగ్గి పోతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రతియేటా రెండు వేల రూపాయలు ట్యూషన్ ఫీజు రాయితీ ఇవ్వాలి అంటూ వేతన సవరణ సంఘం సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: