కృష్ణా జిల్లా.. టీడీపీకి కాస్త పట్టున్న జిల్లా. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీకి కాస్త అనుకూలంగానే ఫలితాలు వచ్చేవి. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం జిల్లాలో జగన్ గాలి బాగా వీచింది. దీంతో జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 14 గెలుచుకుంది. టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఇక ఇందులో వల్లభనేని వంశీ కూడా వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో జిల్లాలో దాదాపు వైసీపీ హవానే ఉంది.

ఇక దీని బట్టి చూసుకుంటే ఇప్పుడు జరగబోయే పంచాయితీ ఎన్నికల్లో వైసీపీనే ఎక్కువ స్థానాలు గెలవాలి. కానీ జిల్లాలో టీడీపీ నేతలు కూడా స్ట్రాంగ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ నేతలు నిదానంగా పుంజుకున్నారు. ముఖ్యంగా విజయవాడ(బెజవాడ) పార్లమెంట్ పరిధిలో టీడీపీ కాస్త స్ట్రాంగ్ అయినట్లే కనిపిస్తోంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఇందులో విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ స్థానాలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. ఇక తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం స్థానాల్లో పంచాయితీ పోరు హోరాహోరీగా జరగనుంది. వైసీపీ-టీడీపీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులే గెలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జగన్ వేవ్ తగ్గింది.

అటు టీడీపీ నేతలు కూడా స్ట్రాంగ్ అయ్యారు. మైలవరంలో దేవినేని ఉమా, నందిగామలో సౌమ్య, జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్యలు బాగానే పనిచేస్తున్నారు. కానీ తిరువూరులో టీడీపీకి సరైన నాయకుడు లేరు. దీంతో అక్కడ కాస్త టీడీపీ వీక్‌గా కనిపిస్తోంది. మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ ఆయ‌న తిరిగి కొవ్వూరు బ‌రిలో ఉండేందుకే ఆస‌క్తిగా ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ గట్టిగానే కనిపిస్తోంది. కాబట్టి ఈ నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీకి చెక్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో జగన్ వేవ్ తగ్గిందనే చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: