ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకునే పలు నిర్ణయాలు ఆయా సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.  తప్పొప్పులతో సంబంధం లేకుండా తాను చెప్పిందే జరగాలనే వైఖరి జగనోరు ప్రదర్శిస్తున్నారని పలువురు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతున్నారు. జగనోరు అధికారం చేపట్టినది మొదలు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలను పరిశీలిస్తే ఆయన నియంత వైకరి అర్ధమౌతుందని పలువురి వాదన. ముఖ్యంగా పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులేయడం, హడావుడిగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, రాజధాని తరలింపు, ఇళ్లస్థలాల పంపిణీలో అవకతవక లు, సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్టులు, అధికారులపై వేట్లు, బదిలీలు చేయడం నుంచి తాజాగా ఎస్‌ఈసీతో జరుగుతున్నా వివాదం వరకు జగనోరు వ్యవహరించిన తీరుతో ఆయా శాఖల అదికారులలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి నెలకొంది. 

జగనోరు తాను చెప్పిందే జరగాలి అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో ఆయన తీరుపై.. పాలనా వ్యవస్థలో భాగంగా ఉన్న ఉన్నతాధికారులు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారని సమాచారం. చిన్నా, చితకా వ్యవస్థలే కాకుండా జగనోరు ఏకంగా న్యాయవ్యవస్థతో కూడా ఢీకొట్టిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ‘151 సీట్లను గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేసిన జగనోరు తాను చెప్పిందే వినాలి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది కాదనలేని వాస్తవం.. నిజానికి  ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించేలా రాజ్యాంగం ఏర్పాటుచేసింది.

 రూల్‌ ఆఫ్‌ లా అమలుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను రాజ్యాంగ పెద్దలు లోతుగా ఆలోచించి పొందుపరిచారు. ఏ వ్యవస్థ బాధ్యత ఆ వ్యవస్థ నిర్వహించేలా.. అదే సమయంలో అన్నింటి మధ్య అవసరమైన సందర్భంలో సమన్వయం ఉండేలా నిబంధనలు ఉన్నాయి. అయితే జగనోరు ముఖ్యమంత్రిగా ఉన్న తానే సర్వ వ్యవస్థలుగా భావిస్తూ‌ వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించినప్పుడే.. ప్రభుత్వాధికారులంతా ఎస్‌ఈసీ ఆదేశాల మేరకే నడుచుకోవాలి.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలి. కానీ ప్రభుత్వ ఒత్తిడితో ఆ పనిచేయలేకపోయారన్నది అందరికీ తెలిసిన వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: