ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్షన్ రాజకీయాలు చాలా వరకు కూడా తక్కువగానే ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే అధికార పార్టీ వైసీపీ విషయంలో మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఫ్యాక్షన్ ని ప్రోత్సహించే విధంగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం చూస్తే చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి. పంచాయతీలు ఏకగ్రీవం అయితే గ్రామాల్లో ఫ్యాక్షన్ అనేది ఉండదు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. స్వయంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై వ్యాఖ్యలు చేశారు.

అంటే పంచాయతీలు ఏకగ్రీవం కాకపోతే గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు భయపదేడుతున్నారు అని... ఏకగ్రీవాల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని అందరి ఆమోదంతో చేస్తే ఇబ్బంది లేదు కానీ ఇష్టం వచ్చినట్టు చేయడం ద్వారా పార్టీ ఇబ్బంది పడుతుందని ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది అని కొంతమంది సూచిస్తున్నారు. ఎంత బలంగా ఉన్నా సరే... ఏదైనా పోటీ లేకపోతే బలహీనంగానే కనబడతారు.

ఈ విషయం తెలియని వైసీపీ నేతలు ఇప్పుడు ఏకగ్రీవాల మీద దృష్టి పెడుతూ వస్తున్నారు. గత ఏడాది పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా ప్రకటన చేశారు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాయి. ఇక ఇప్పుడు మరో ముందడుగు వేసి కొంత మంది వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలే తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. అసలు పంచాయతీలను ఏకగ్రీవం చేయడం అనే ఆలోచన ఎంతమాత్రం మంచిది కాదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ ఎంత బలంగా ఉన్నా సరే గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: