ఎంత బలమైన పార్టీ అయినా సరే అధికారం వ్యవస్థలను వాడుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇది కాస్త భిన్నంగా జరుగుతుందనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. అధికారులను వాడుకొనే విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న తప్పులు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పోలీసుల పై తీవ్రస్థాయిలో ఆరోపణలు విపక్షాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి ఉద్యమం విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ప్రజలు కూడా.

పోలీసులు కానీ వాళ్లను కూడా అమరావతిలో లాఠీలు ఇచ్చి నిలబెట్టారని దీనిపై పోలీసులు కూడా చాలా సందర్భాల్లో విస్మయం వ్యక్తం చేసిన పరిస్థితి ఉండేది. ఇక ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో పోలీసులు కొంత మంది మీద చేసిన దాడులు అలాగే కొంత మందిని అరెస్టు చేసిన విధానం ప్రవర్తించే విధానం కూడా గుంటూరు జిల్లాలో వైసీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. పార్టీల కతీతంగా పోలీసుల చర్యలను కూడా తప్పుబట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వైసిపి స్థానిక సంస్థల ఎన్నికలలో ఓడి పోవడానికి ప్రధాన కారణం కావచ్చు అని కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కనకదుర్గమ్మ గుడికి మహిళలు వెళ్తుంటే పోలీసులు ప్రవర్తించిన తీరుపై జాతీయస్థాయిలో విస్మయం వ్యక్తం చేసారు. ఇలాంటి చర్యల ద్వారా పోలీసులు వైసీపీ ని ఇబ్బంది పెడుతున్నారని పోలీసుల తీరుపై గ్రామాల్లో అసహనం పెరిగిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ను కట్టడి చేయకపోతే మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ ఇబ్బంది పడవచ్చు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని కూడా పార్టీపార్టీపార్టీ అని తేడా లేకుండా ఇప్పుడు అరెస్టు చేయడంతో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: