ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము అని పదేపదే ముఖ్యమంత్రి జగన్ చెబుతూ వస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో చాలా వరకు కూడా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. అయితే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సరే రోడ్ల విషయంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న విధానం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఏ జిల్లాలో కూడా రోడ్లు ఒక కిలోమీటర్ కూడా సరిగా లేని పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా కొత్త రోడ్డు నిర్మాణం అనేది జరిగిన పరిస్థితి లేదు అని చెప్పాలి.

 ప్రజలలో కూడా అసహనం పెరిగిపోతోంది. సంక్షేమ కార్యక్రమాలు ఎంత ఘనంగా అమలు చేసిన అభివృద్ధి జరగకపోతే మాత్రం గ్రామాల్లో ప్రజలలో అసహనం అనేది పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. గ్రామీణ వ్యవస్థలో రోడ్లు కీలక పాత్ర పోషిస్తుంటాయి. వ్యవసాయ పనులకు వెళ్లేవారు గానీ పట్టణాలకు వచ్చేవాళ్లు గాని రోడ్లు సరిగా లేకపోతే ఇబ్బందులు పడుతుంటారు. చిన్నచిన్న అవసరాలకు కూడా పట్టణంలో కి కావాల్సిన వాళ్ళకి రోడ్లు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. దీని కారణంగానే ఇప్పుడు అధికార పార్టీ గ్రామాల్లో ఇబ్బంది పడుతుందని అంటున్నారు.

కనీసం ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి వద్దకు వచ్చి రోడ్డు బాగాలేదు అని చెప్పి నిధులు కూడా అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ తప్పులు ఎక్కువగా చేస్తుంది. గుంటూరు జిల్లాలో అయితే చాలా వరకు రోడ్లు దారుణంగా ఉన్నాయి. దీని కారణంగా ప్రజలు పైకి చెప్పలేని విధంగా అధికార పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి జగన్ వద్దకు తమ నియోజకవర్గాల్లో పరిస్థితి ని తీసుకొని వెళ్లలేక పోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్క గ్రామంలో కూడా ఇప్పుడు జరగలేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: