ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల్లో గనుక తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది అంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా అధికార పార్టీని ఎదుర్కొనే విషయంలో ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. 2014 నుంచి కూడా చంద్రబాబు నాయుడు అధికార పార్టీని ఎదుర్కొనే విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అనేక ఇబ్బందులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు చాలామంది నియోజక వర్గాలలో ప్రజల సమస్యల మీద పోరాటం చేయలేకపోతున్నారు.

అధికార పార్టీకి భయపడి కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు నియోజకవర్గాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే అయితే నియోజకవర్గానికి కూడా రావడం లేదని సమాచారం. అధికార పార్టీ ఎప్పుడు ఏం చేస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్న సదరు ఎమ్మెల్యే అసలు నియోజకవర్గానికి రాకుండా కార్యకర్తలతో మాట్లాడకుండా పూర్తిగా నియోజకవర్గ బాధ్యతలను వైసీపీ చేతిలో పెట్టారు అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకోసం కష్ట పడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే తీరుపై చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన కోసం అధికార పార్టీ నేతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతోంది. ఆయన కోసం ఒక మంత్రి గారే రంగంలోకి దిగారని సమాచారం. అధికార పార్టీ నుంచి చాలామంది నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్న సరే ఎమ్మెల్యే ఇన్నిరోజులు పార్టీ మారడానికి ఆసక్తి చూపించలేదు. అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయనను ఇబ్బంది పెట్టడానికి రంగంలోకి దిగడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా సదరు ఎమ్మెల్యే తో చర్చలు జరపడానికి ఇప్పుడు రంగం సిద్ధం చేశారని త్వరలోనే సమావేశమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: