జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. వ్యవసాయ అభివృద్ధికి మాత్రమే కాదు ఇక పేద విద్యార్థులు చదువుకునేందుకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది.  ఈ క్రమంలోనే జగన్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలపైనే ప్రస్తుతం ఎన్నో ఆశలు పెట్టుకుంది వైసిపి పార్టీ. ఎందుకంటే తమ పథకాలతో  ప్రజల్లో తమ ప్రభుత్వంపై మంచి అభిప్రాయాన్ని తీసుకు వచ్చి తమకు ఓటు వేసేలా చేస్తాయి అని ప్రస్తుతం వైసీపీ నేతలు అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ  తమకు  ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు అనే భావనతో ఉన్నారు.



 అయితే పథకాల వరకు జగన్ సర్కార్ ప్రజలను ఆకర్షించినప్పటికీ.. అభివృద్ధి విషయంలో మాత్రం జగన్ సర్కార్ ఇక ఏపీ ప్రజలందరినీ నిరాశపరిచింది అనే చెప్పాలి.  ఎప్పుడు ఏదో ఒక సరికొత్త పథకాన్ని తెరమీదకు తీసుకురావడం..  పథకాల పేరుతో జనాలకు డబ్బులు పంచటం చేసింది..  అదే సమయంలో ఏదో ఒక వివాదంతో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడం లాంటి దానిపైన ఎక్కువగా జగన్ సర్కార్ దృష్టి పెట్టిందని అటు ప్రజలు భావిస్తున్నారు. పథకాల  మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద జగన్ సర్కార్ పెట్టలేకపోయింది అని అంటున్నారు ఏపీ ప్రజలు.



ఇక గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతుల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది.  పథకాల కోసం వేల కోట్లు నిధులు విడుదల చేస్తున్న జగన్ సర్కార్..  రాష్ట్రంలోని పల్లెల్లో ఇక రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన  విషయాన్ని మాత్రం మరచి పోయింది అని ప్రస్తుతం ఎంతో మంది ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక పల్లె ప్రజలు అందరూ జగన్ సర్కార్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రస్తుతం చెబుతున్నారు విశ్లేషకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ సర్కార్కు పల్లె ప్రజలు షాక్ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: