రాష్ట్రంలో ఏంజ‌రిగినా.. క్రెడిట్ తీసుకునే వైసీపీ సోష‌ల్ మీడియా ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. ఎక్క‌డా కామెంట్లు కానీ, ఎక్క‌డా పోస్టులు కానీ లేకుండా మూడు రోజులుగా మూగ‌బోయింది. దీంతో అస‌లు వైసీపీ సోష‌ల్ మీడియా ప‌రిస్తితి ఏంటి? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. వైసీపీకి సోష‌ల్ మీడియా విభాగాలు చాలానే ఉన్నాయి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టా గ్రామ్‌.. ఇలా సోష‌ల్ మీడియాలో అనేక విభాగాలు ఉన్నాయి. అదేస‌మ‌యంలో ఆన్‌లైన్ సైట్లు కూడా వైసీపీకి అనుకూలంగా ప‌నిచేసేవి చాలానే ఉన్నాయి.

అయితే.. తాజాగా ఏపీలో మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇవ‌న్నీ.. ఒక్క‌సారిగా మూగ‌బోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? అనేది కీల‌కంగా మారింది. ఇటీవ‌ల రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌తో ప్ర‌భుత్వం నువ్వా-నేనా అనే రేంజ్‌లో సాగింది. ఈ స‌మ‌యంలో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌ను ఉద్దేశించి వైసీపీ సోష‌ల్ మీడియాలో కామెంట్లు కురిశాయి. భారీ ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనికి మ‌ళ్లీ వివిధ పోస్టుల‌ను, ఫొటోల‌ను కూడా జ‌త చేశారు.

ఇక‌, ప్ర‌భుత్వం చేసింది స‌మ‌ర్ధ‌నీయ‌మేనంటూ.. సోష‌ల్ మీడియాలోదంచి కొట్టారు. రెండు మూడు రోజులు అంటే.. కేసు సుప్రీం కోర్టుకు వెళ్లే వ‌ర‌కు..కూడా వైసీపీ సోష‌ల్ మీడియాదుమ్ము రేపింది. అయితే.. పంచాయతీ ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాలంటూ.. ప్ర‌భుత్వం చేసిన డిమాండ్‌ను సుప్రీం కోర్టు సైతం తోసిపుచ్చింది. దీంతో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ వాద‌న గెలిచింది. ఇక అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు.. టీడీపీ, బీజేపీ స‌హా క‌మ్యూనిస్టుల వాద‌న కూడా గెలిచిన‌ట్ట‌యింది. దీంతో వైసీపీ నేత‌లు ఒక్క సారిగా షాక‌య్యారు.

వాస్త‌వానికి సుప్రీంలో త‌మ‌కు అనుకూలంగా తీర్పు వ‌స్తుంద‌ని వీరంతా భావించారు. కానీ వ్య‌తిరేకంగా రావ‌డం, సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ భారీ ఎత్తున సోష‌ల్ మీడియాలో యాక్టివ్ కావ‌డంతో.. దీనికి కౌంట‌ర్లు ఇవ్వ‌డంలో వైసీపీ సోష‌ల్ మీడియా పూర్తిగా విఫ‌ల‌మైంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. తీవ్ర అసంతృప్తేన‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: