ఏపీలో గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ఎంతో మంది నేత‌ల‌కు ఎన్నో ప‌ద‌వులు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. జ‌గ‌న్ ప‌ద‌వులు ఇచ్చిన నేత‌ల లిస్టు అటు శ్రీకాకుళం. ఉత్త‌రాంధ్ర నుంచి మొద‌లు పెట్టి ఇటు గోదావ‌రి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం.. నెల్లూరు సీమ జిల్లాల వ‌ర‌కు కౌంట్ చేస్తే 100 పైనే ఉంటుంది. జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్రచారంలో సీట్లు త్యాగం చేసిన వారి నుంచి.. ఇత‌ర సీనియ‌ర్ నేత‌ల‌కు ఇచ్చిన ఎమ్మెల్సీల హామీల‌ను కౌంట్ చేస్తే వాళ్లే ఏకంగా 40 - 50 మంది ఉంటారు.

వీరిలో రాజ‌ధాని జిల్లా అయిన గుంటూరు జిల్లా నుంచి ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌ను మంత్రుల‌ను చేసి త‌న కేబినెట్లో త‌న ప‌క్క‌న కూర్చో పెట్టుకుంటాన‌ని చెప్పిన జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు వారిని ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. గుంటూరు జిల్లాలో చిల‌క‌లూరిపేట సీటు త్యాగం చేసిన పార్టీ సీనియ‌ర్ నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తాన‌న్న జ‌గ‌న్ ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక మంగ‌ళ‌గిరిలో గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌న‌యుడు.. అప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ఆర్కేను గెలిపిస్తే కేబినెట్లో కూర్చో పెట్టుకుంటాన‌ని చెప్పారు.

ఆ త‌ర్వాత ఆయ‌న్ను సీఆర్డీచే చైర్మ‌న్‌ను చేసినా దాని వ‌ల్ల ఉప‌యోగం లేదు. ఇక ఇప్పుడు అమ‌రావ‌తి ప్రాంతంలో ఉన్న మంగ‌ళ‌గిరిపై మూడు రాజ‌ధానుల ఎఫెక్ట్ తీవ్రంగా ప‌డింది. మూడు రాజ‌ధానుల ప్ర‌భావంతో మంగ‌ళ‌గిరి, తాడికొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు అంద‌రూ అన్ని విధాలుగా కుదేల‌య్యారు. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో స్థానిక ఎన్నిక‌ల్లో ఫ్యాన్‌కు తీవ్ర‌మైన క‌ష్టాలు త‌ప్పేలా లేవు. మంగ‌ళ‌గిరిలో మంగ‌ళ‌గిరి - తాడేప‌ల్లి - దుగ్గిరాల మండ‌లాల్లో స్థానిక ఎన్నిక‌ల్లో ఫ్యాన్ ఏటికి ఎదురీదుతోంది.

ఇక్క‌డ వైసీపీ ఓడిపోతే అది ఆర్కే పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌కు మ‌రింత ఎదురు దెబ్బ అవ్వ‌డంతో పాటు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి లేదా మ‌రే ప‌ద‌వి కూడా వ‌చ్చే అవ‌కాశాలు లేవు. ఏదేమైనా జ‌గ‌న్ చేసిన ప‌నితో ఆర్కేకు మంత్రి ప‌ద‌వి సంగ‌తేమో కాని ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌కే దెబ్బ‌ప‌డిపోయేలా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: