అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని దేశంలో అత్యంత గొప్ప ఆలయంగా శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రామ మందిర నిర్మాణానికి దేశంలోని నలు మూలాల నుండి  విరాళాలు సైతం వసూలు చేస్తుంది. ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలన్న ఉద్దేశ్యంతో ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది. ఇప్పటికే విరాళాలు సేకరణ కూడా ట్రస్ట్ ప్రారంభించింది. అంతే కాకుండా విరాళాలు నేరుగా అందజేయడానికి ఒక పోర్టల్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే మందిర నిర్మాణనానికి కొంతమంది ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, సినీ తారలు కొంతమంది విరాళాలు ప్రకటించారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాను విరాళం ఇచ్చానని దేశ ప్రజలు అంతా విరాళం ఇచ్చి ఆలయ నిర్మాణం లో భాగస్వామ్యం అవ్వాలని ఓ వీడియోలో పేర్కొన్నారు. మరోవైపు హీరోయిన్ లలో ప్రణీత విరాళం ప్రకటించిన మొదటి హీరోయిన్ గా నిలిచింది. ఇదిలా ఉండగా మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణపై విమర్శలు కూడా వస్తున్నాయి..

అయోధ్యలో నిర్మించే మందిరానికి ఇక్కడి వాళ్ళు ఎందుకు విరాళాలు ఇవ్వాలని కొంతమంది రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. అయోధ్యలో నిర్మించే రామ మందిరానికి ఎవరూ విరాళాలు ఇవ్వద్దని అన్నారు. బీజేపీ నేతలు విరాళాల పేరుతో బిచ్చమెత్తుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాము రామ భక్తులమేనని కానీ విరాళాలు ఇవ్వమని అన్నారు. ఇక తాజాగా మరో ఎమ్మెల్యే సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. పరకాల ఎమ్మెల్యే చాలా ధర్మారెడ్డి మాట్లాడుతూ...భద్రాచలం లో రాముడు లేడా మీరు కట్టే గుడి మాకెందుకు అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచనం గా మారాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పలువురు మండి పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: