ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్ సీపీ ఏకంగా 151 సీట్ల‌తో అధికారంలోకి వ‌చ్చింది. ఈ 151 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది కొత్త వారే ఉన్నారు. మ‌రి కొంద‌రు రాజ‌కీయాల‌తో సంబంధం లేని వారు కూడా ఆర్థిక‌, ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరి.. ఎమ్మెల్యే సీట్లు ద‌క్కించుకుని జ‌గ‌న్ వేవ్ లో ఎమ్మెల్యేలు అయిపోయారు. ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని ప్రాంతంలో ఓ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మ‌హిళా ఎమ్మెల్యే కూడా ఎన్నిక‌ల‌కు ముందే పార్టీలోకి వ‌చ్చి అనూహ్యంగా ఎమ్మెల్యే అయిపోయారు.

ఆమె ఎన్నిక‌ల‌కు ముందు నుంచే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నా... ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టి నుంచి అటు సొంత పార్టీ నేత‌ల‌తో పాటు ఇటు విప‌క్ష నేత‌ల‌తో పాటు అనేక మందికి టార్గెట్ అయిపోతున్నారు. ఇప్పుడు స‌ద‌రు ఎమ్మెల్యేకు స్థానిక ఎన్నిక‌లు పెద్ద అగ్ని ప‌రీక్ష‌గా మార‌నున్నాయి. ఇప్ప‌టికే ఆమె సొంత పార్టీ నేత‌ల గురించి మాట్లాడిన మాట‌లు సైతం ఆడియోల రూపంలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఆమె పై సొంత పార్టీ నేత‌లే తీవ్రంగా విమ‌ర్శ‌లు చేసి ఆమెను ర‌చ్చ  కీడ్చారు.

ఇక పార్టీ అధిష్టానం సైతం ఆమెను ప‌క్క‌న పెట్టేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో సీనియ‌ర్ నేత‌కు సీటు ఇవ్వాల‌ని ఆమెకు ఎర్త్ పెట్టే టైం కోసం వెయిట్ చేస్తోంది. ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ నుంచి వ‌చ్చిన ఓ నేత‌కు జ‌గ‌న్ ఏకంగా పెద్ద ప‌ద‌వే ఇచ్చారు. ఆయ‌న డైరెక్ష‌న్‌లోనే ఇప్పుడు ఈ మ‌హిళా ఎమ్మెల్యేను టార్గెట్ చేసే ప్ర‌క్రియ న‌డుస్తోంద‌న్న చ‌ర్చ‌లు సొంత పార్టీ నేత‌ల్లోనే ఉన్నాయి.

ఇక అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లిస్తార‌న్న వార్త‌ల‌తో పాటు అమ‌రావ‌తి ఉద్య‌మం ఉధృతంగా న‌డుస్తోన్న నేప‌థ్యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌ది, ఇరవై శాతం సీట్లు మించి గెలిచే ప‌రిస్థితి లేదు. ఏదేమైనా ఆమెకు ఎలా ఎర్త్ పెట్టాలా ? అని పార్టీ నేత ఆలోచిస్తుంటే ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి సాకుగా చూపి ఆమెను ప‌క్క‌న పెట్టేస్తార‌న్న‌దే పార్టీ నేత‌ల టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: