గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కీలక‌మైన ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో పార్టీ బాధ్య‌త‌లు అన్ని ఆ పార్టీ కీల‌క నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డే చూసేవారు. టిక్కెట్ల కేటాయింపు నుంచి ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల వ‌ర‌కు అన్ని సాయి రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేవి. ఇక ఎన్నిక‌ల్లో గెలిచాక సైతం ఎవ‌రెవ‌రికి ఏయే ప‌ద‌వులు ఇవ్వాలి ?  ఉత్త‌రాంధ్ర‌లో పార్టీ , ప్ర‌భుత్వం ఎలా న‌డ‌వాలి ? అన్న‌ది కూడా సాయి రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేవి. చివ‌ర‌కు అక్క‌డ గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రుల‌ను కూడా సాయిరెడ్డి డ‌మ్మీల‌ను చేసేసి ఒంటి చేత్తో చ‌క్రం తిప్పేసేవారు. దీంతో పార్టీ నేత‌ల్లోనే సాయి రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఉత్త‌రాంధ్ర మంత్రులు సైతం విజ‌య సాయి రెడ్డి ఇక్క‌డ హ‌డావిడి చేస్తుండ‌డంతో త‌మ‌ను ప‌ట్టించుకునే వారే లేర‌ని ఆవేద‌న‌తో ఉన్నారు. దీనికి తోడు ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో వైసీపీలో తీవ్ర‌మైన వ‌ర్గ పోరు న‌డుస్తోంది. సాయి రెడ్డి పెత్త‌నంపై ఏకంగా ఇద్ద‌రు మంత్రులు, ప‌ది మంది ఎమ్మెల్యేల వ‌ర‌కు మండి ప‌డుతున్నార‌ట‌. అస‌లు ఉత్త‌రాంధ్ర‌లో పార్టీ ఎమ్మెల్యేలు అంద‌రిని ఆయ‌న డ‌మ్మీల‌ను చేసి ప‌డేశార‌ని అంటున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో ఫ్యాన్‌ను గిర్రున తిప్ప‌డంలో సాయి రెడ్డి కొంత వ‌ర‌కు చ‌క్రం తిప్పారు.

అందుకే జ‌గ‌న్ ఆయ‌న అక్క‌డ ఎంత పెత్త‌నం చేసినా మాట్లాడ‌డం లేదు. అయితే ఈ సారి పంచాయ‌తీతో పాటు ఇత‌ర స్థానిక ఎన్నిక‌ల్లో అక్క‌డ వైసీపీకి మెజార్టీ స్థానాలు రాక‌పోతే ఊరుకోన‌ని సాయి రెడ్డికే నేరుగా వార్నింగ్ ఇచ్చారంటున్నారు. పైగా అక్క‌డ రాజ‌ధాని ఏర్పాటు ప్ర‌క‌ట‌న అంశం కూడా మ‌న‌కు సానుకూలం అవుతుంద‌ని.. ఇవ‌న్నీ ప్ల‌స్ చేసుకుని ఉత్త‌రాంధ్ర‌లో స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటితేనే మ‌న‌కు అక్క‌డ ప‌టిష్ట‌మైన పునాది ఏర్ప‌డుతుంద‌ని జ‌గ‌న్ సూచ‌న‌లు చేశార‌ట‌. అయితే సాయి రెడ్డి పెత్త‌నాన్ని స‌హించ లేని వారు మాత్రం ఇక్క‌డ దెబ్బ ప‌డితే అయినా సాయి రెడ్డి పెత్త‌నానికి చెక్ ప‌డుతుంద‌న్న ఆశ‌తో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: