ఏపీ సీఎం ఎంతో క‌సితో క‌ష్ట‌ప‌డి సీఎం అయినా ఆయ‌న రాజ‌కీయ అనుభ‌వ లేమి మాత్రం స్ప‌ష్టంగా కనిపిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వాన్ని న‌డ‌పడంలో ఆయ‌న ఎన్నో త‌ప్పులు చేస్తున్నారు. ఇక ఆయ‌న దూకుడు చ‌ర్య‌ల‌కు కోర్టుల నుంచి వ‌రుస‌గా మొట్టి కాయ‌లు ప‌డుతూనే ఉన్నాయి. నీ మొండి ప‌ట్టుద‌ల ఉంటే నీ పార్టీలో చూపించుకో.. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల మీద కాదు అని కోర్టుల చెప్ప‌క‌నే చెపుతున్నాయి. ఇక పార్టీని న‌డిపే విధానంలోనూ జ‌గ‌న్ బ‌ల‌హీన‌త స్ప‌ష్టంగా తెలుస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన జ‌గ‌న్ అక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం సాధించాల‌ని ఇప్ప‌టికే ఆయా జిల్లాల నేత‌ల‌తో పాటు కీల‌క నేత‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని.. జ‌న‌సేన గెలిచిన రాజోలులో జ‌న‌సేన‌ను వీక్ చేసేందుకు ఆ పార్టీల ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీ సానుభూతి ప‌రులుగా చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ కంచుకోట అయిన హిందూపురంలో బాల‌య్య‌కు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ వేసిన స్కెచ్‌లు అన్నీ ఇప్పుడు రివ‌ర్స్ అవుతున్నాయి.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అక్క‌డ నేత‌లు గ్రూపుల గోల‌తో పార్టీని బ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు అక్క‌డ న‌వీన్ నిశ్చ‌ల్ నేత‌గా ఉన్నారు. 2014లో ఆయ‌నే బాల‌య్య‌పై పోటీ చేసి ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో నాన్ లోక‌ల్ అయిన మ‌హ్మ‌ద్ ఇక్బాల్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు ఇక్బాల్ వ‌ర్సెస్ న‌వీన్ నిశ్చ‌ల్ మ‌ధ్య ఎంత మాత్రం పొస‌గ‌డం లేదు. ఇక్బాల్ నాన్ లోక‌ల్ కావ‌డంతో ఆయ‌న్ను స్థానిక కేడ‌ర్ ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇక్బాల్ కంటే అక్క‌డ న‌వీన్ స్ట్రాంగ్‌.. కానీ జ‌గ‌న్ చేసిన ప‌నితో ఇప్పుడు హిందూపురంలో టీడీపీ పెద్ద క‌ష్ట‌ప‌డ‌కుండానే తిరుగులేని మెజార్టీ సీట్లు త‌న ఖాతాలో వేసుకునే ఛాన్స్ క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: