ఇండియాహెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... దేశంలో ఎక్కడ చూసిన అన్యాయాలు, అక్రమాలు, మోసాలు నడుస్తున్నాయి.ఇక ఉద్యోగాల పేరుతో చాలా మంది యువతీ యువకులు మోసపోతున్నారు. ఎన్నో కలలతో ఆశలతో ఉద్యోగాల కోసం నగరాలకు తరలి వస్తున్న యువతకు మోసాలు బాగా జరుగుతున్నాయి. ఇక తాజాగా ఇంకో మోసపూరిత ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.విశాఖపట్టణంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను అందినకాడికి దోచుకున్నారు. నకిలీ ఐడీ కార్డులు, చెక్కులు చూసి మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్‌కి వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...విశాఖపట్టణంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను నట్టేట ముంచిందో బోగస్ కంపెనీ. ట్రైనింగ్ ఇచ్చి మరీ ఉద్యోగాలిప్పిస్తామని.. ఆకర్షణీయమైన జీతమని ఊహించని విధంగా మోసం చేశారు కేతుగాళ్ళు. నకిలీ ఐడీ కార్డులతో నమ్మించారు. తీరా తాము మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు.. న్యాయం చేయండంటూ పోలీస్ ‌స్టేషన్ మెట్లెక్కితే అక్కడ వారు స్పందించలేదు . తమకు న్యాయం చేయాలని.. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ నిరుద్యోగులు వాపోతున్నారు.సాప్ట్ వేర్ కంపెనీలో మంచి ఉద్యోగాలంటూ , ట్రైనింగ్ లోనే వేలాది రూపాయలు జీతం అని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేశారు.

కంపెనీ ప్రచారం చూసి నమ్మిన వందలాది మంది నిరుద్యోగులు లక్షలాది రూపాయలు చెల్లించి జాయిన్ అయ్యారు. ట్రైనింగ్ అయిపోయిందంటూ నకిలీ ఐడీ కార్డులు, ఫేక్ చెక్‌లు చేతిలో పెట్టారు నిర్వాహకులు. అవి నకిలీవని తెలిసిన బాధితులు తాము మోసపోయామని గ్రహించి తమ డబ్బు తిరిగి ఇవ్వాలని ఆఫీస్‌కి వెళ్లి నిలదీయడంతో షాకిచ్చారు. తిరిగి బాధితులపైనే దాడి చేశారు.

దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. అయితే న్యాయం చేయాల్సిన పోలీసులు పట్టించుకోకపోగా తమపై విరుచుకుపడుతున్నారంటూ బాధితులు వాపోయారు. తమకు చావే శరణ్యమంటూ పోలీస్ స్టేషన్ వద్దే ఆందోళనకు దిగారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చి రెండు రోజులవుతున్నా పోలీసులు ఇంత వరకు నిందితులపై చర్యలు తీసుకోకుండా కేసును కొట్టిపారేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: