జగన్ ఎలాగైనా పంచాయితీ ఎన్నికలలో గెలిచి ప్రతి పక్షాలకు మరోసారి తన పవర్ ను చూపించాలని తహతహ లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పటికే అన్ని జిల్లాల మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పంచాయితీ ఎన్నికలలో ఎలాగైనా వైసీపీ విజయ కేతనం ఎగరేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించాడు. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వైసీపీ నెగ్గుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. దీనికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలను సంక్షేమ పథకాలతో సంతృప్తి పరిచినప్పటికీ, మిగతా ప్రజలు అభివృద్ధి జరగలేదని ప్రభుత్వంపై మరియు వైసీపీపై గుర్రుగా ఉన్నారు.

కాగా ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ అన్ని జిల్లాలకు పంచాయితీ ఎన్నికలు జరిపించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపటి నుండి నామినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నామినేషన్ వేసే సమయంలో ఎటువంటి వివాదాలు, గొడవలు జరుగకుండా ముందస్తుగానే పోలీసు డిపార్ట్మెంట్ గట్టిగానే బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన నామినేషన్ రూల్స్ ప్రకారం రేపు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే సమయ పరిమితిగా నిర్ణయించారు. ఆపైన ఎవ్వరు వచ్చినా అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు.

ఈ నామినేషన్ ఈ నెల 31 వ తేదీవరకు ఉండనుంది. అయితే ఇప్పుడు ఉన్న పళంగా ఏపీ సీఎం జగనోరు అనంతపురం జిల్లాకు రానున్నారని అధికారికంగా వార్తను వెల్లడించారు. అయితే జగన్ ఆఫీసు నుండి వస్తున్న సమాచారం ప్రకారం సీఎం వచ్చేది అక్కడ రేషన్ సరుకులను పంపిణీ చేసే వాహనాలను ప్రారంభించడానికని చెబుతున్నారు. అయితే కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పంచాయితీ ఎన్నికలు కాబట్టి, అనంతపురం జిల్లా వైసీపీ నాయకులతో మీటింగ్ జరపడానికి వస్తున్నారని భోగట్టా. మరి జగనోరు ఈ ఎన్నికలలో గెలవడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: