ఏపీలో పేరుకు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ అసలు యుద్ధం తెర వెనక రంజుగా సాగుతోంది. ఏపీలో అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష తెలుగుదేశం పార్టీ మోహరించి ఉన్నాయి. రెండు పార్టీలు కూడా బస్తీ మే సవాల్ అంటున్నాయి.

ఇక పంచాయతీ ఎన్నికల వేళ చంద్రబాబు మీడియా ముందుకు వచ్చేశారు. ఆయన ప్రతీ రోజూ గంటల తరబడి మాట్లాడుతున్నారు. అధికార వైసీపీని కార్నర్ చేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల మ్యానిఫేస్టో విడుదల చేశారు.

దాంతో ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజుకుంది. నిజానికి ఏపీలో రాజకీయ సందడి బయట కనిపిస్తున్నా కూడా పంచాయతీ ఎన్నికలు పూర్తిగా పార్టీలకు అతీతమైనవి. ఇక్కడ రాజకీయ పార్టీలు వెనక నుంచి మాత్రమే మద్దతు ఇస్తాయి. అభ్యర్ధులకు పార్టీల గుర్తులు కూడా ఉండవు, గెలిచాక వారు ఏ పార్టీలో ఎన్నాళ్ళు మద్దతుగా ఉంటారు  అన్నది కూడా తెలియదు.

కానీ టీడీపి అధినేత  చంద్రబాబు మాత్రం అతి ఉత్సాహంతో ఎన్నికల మ్యానిఫేస్టో సడెన్ గా  రిలీజ్ చేశారు. ఇది రాజ్యాంగ విరుధ్ధమని వైసీపీ అంటోంది. చంద్రబాబు ఎలా ఎన్నికల మ్యానిఫేస్టో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు అని కూడా వైసీపీకి చెందిన అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. దీని మీద నిమ్మగడ్డ రమెష్ కుమార్ యాక్షన్ తీసుకుంటారా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చూస్తే మాత్రం చంద్రబాబు అతి ఉత్సాహంతో చేశారా లేక సీనియర్ నేతగా తాను ఏం చేసినా ఫరవాలేదు అనుకుని చేశారా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. దీని మీద తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని సంజాయిషీ అడిగి చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ దిశగా యాక్షన్ కి దిగుతారా అన్నది కూడా చర్చగా ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: