గ్రామాల్లో రాజకీయాలు దూరకూడదని, వర్గ పోరుతో ఎవరూ నలిగిపోకూడదని, అభివృద్ధి పధంలో అంతా కలసి ఒక్కటిగా నడవాలని పంచాయతీ ఎన్నికలకు పార్టీలను దూరంగా ఉంచారు. పార్టీలు వాటితో పాటే రాజకీయాలూ  చేరితే పవిత్రత దెబ్బ తింటుందన్న సదుద్దేశ్యంతో రాజ్యాంగ నిర్మాతలు ఇలా చేశారు.

అయితే ఇపుడ్ పంచాయతీ ఎన్నికలను చూస్తూంటే ముఖ్యమంత్రి ఎన్నికల కోసం జరుగుతున్న పోటీగా ఉంది. ఇందులో గెలిస్తే రేపటి రోజున నేను ముఖ్యమంత్రి అవుతాను అని చంద్రబాబు భావిస్తున్నారులా ఉంది. అదే సమయంలో ఈ ఎన్నికలలో ఓడితే నా కుర్చీకి ముప్పు అని జగన్ భావించినా తప్పే అవుతుంది. ఎందుకంటే ఇది పల్లె పోరు. అక్కడ ఎవరు గెలిచినా  చివరికి వారు ప్రభుత్వంతో కలసి పనిచేస్తారు. వారిని నిధులు విధులూ చూసి గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కచ్చితంగా పాలకుల మీద ఉంది.

అపుడెపుడో 1980 దశకంలో పంచాయతీ ఎన్నికలు జరీగితే గెలిచిన వారు అంతా మా పార్టీ వారే అని అధికార కాంగ్రెస్ నేతలు జబ్బలు చరచి మరీ గట్టిగానే చెప్పుకున్నారు. ఇక 2013లో వైసీపీ మద్దతుతో  ఇతర పార్టీల మద్దతుతో  గెలిచిన వారు కూడా తరువాత 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి చేరిపోయారు. దాని అర్ధం ఏంటి అంటే పంచాయతీలకు నిధులు కావాలి. అభివృద్ధి జరగాలి. అంతే తప్ప ఎవరు గెలిస్తే పోయేది లేదు, ఓడితే వచ్చే నష్టం లేదు. నిజానికి పల్లె సీమలలో రాజకీయం ఉండకూడదు, కానీ దాన్ని జొప్పిస్తున్నారు. ఆఖరుకు రాజకీయ పార్టీలు  ఎన్నికల మ్యానిఫేస్టోలను కూడా తయారు చేసి పచ్చని పల్లెలలో రాజకీయ చిచ్చు పెడుతున్నారు. ఈ ఎన్నికలు ప్రశాంతగా జరిగేందుకు అంతా కృషి చేయాలి. అటు అధికార పార్టీ ఇటు విపక్షం కూడా ఈ ఎన్నికలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మేధావులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: