గాలి,నీరు,ఆహారం మనిషి జీవితంలో తప్పనిసరి అన్న  విషయం తెలిసిందే. వీటి  లో ఏది లేకపోయినా మనిషి జీవించ లేడు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అందుకే ప్రతి ఒక్కరు విధిగా ప్రతి క్షణం గాలి పీల్చుకుంటూ  ఉంటారు అంతే కాకుండా బ్రతకడానికి ఆహారం తీసుకుంటూ ఉంటారు..  ఇక ప్రతి ఒక్కరూ నీరు తాగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూడింటిలో ఏది తక్కువైనా కూడా మనిషి ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది.  ఇక ముఖ్యంగా ఎవరైనా నీళ్లు తాగకుండా వుండాలి అంటే కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే నీళ్లు తాగకుండా ఉండగలుగుతారు. కానీ ఇక్కడ బామ్మా మాత్రం ఏకంగా పదేళ్ల నుంచి నీళ్లు తాగడం లేదు.


 ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజంగానే జరిగింది. పదేళ్ల నుంచి ఒక్క నీటి చుక్క కూడా తాగకుండాఎంతో ఆరోగ్యంగా ఉంటూ వస్తుంది ఇక్కడ ఒక బామ్మ .  ఈ ఘటన  జనగామ జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  తరిగొప్పుల లో ప్రమీల అనే 70 సంవత్సరాల బామ్మ ఉంటుంది. గత పదేళ్ల నుంచి నీరు తాగడం మానేసింది బామ్మ. ఇంట్లో కుటుంబ సభ్యులు నీళ్లు తాగమని చెబితే వద్దే వద్దు అంటూ భీష్మించుకు కూర్చుంది..  పదేళ్ల క్రితం అందరిలాగే నేను కూడా మంచి నీళ్ళు తాగేదానినని కానీ ఇప్పుడు ఎందుకో  నీరు తాగడం నచ్చడం లేదు అంటూ చెబుతుంది ఈ బామ్మ.


 10ఏళ్ళ నుంచి నీళ్లు తాగకుండా ఉన్నప్పటికీ తనలో  మాత్రం ఏ మార్పూ రాలేదు అంటూ చెప్పుకొచ్చింది.  చురుకుగా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది .  సాధారణంగా కాస్త పనిచేసినా కూడా దాహం వేస్తోంది.దాహం వేసిన  సమయంలో కొన్ని నీళ్లు కడుపులోకి వెళ్లాయి  అంటే  ప్రాణం లేచొచ్చింది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక బామ్మ  పదేళ్ల నుంచి నీళ్లు తాగకుండా ఉండటం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. కుటుంబ సభ్యులు వైద్యులు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు.  ఒకవేళ బలవంతంగా నీళ్లు తాగిస్తే  బయటికి ఉమ్మేస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: