ప‌శ్చిమ‌గోదావ‌రి రాజ‌కీయాల్లో ద‌శాబ్దాలుగా చ‌క్రం తిప్పుతోన్న మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ కొంత కాలంగా రాజ‌కీయాల్లో అంత యాక్టివ్ గా ఉండ‌డం లేదు. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న ఆయ‌న ఆ పార్టీలో ఉండ లేక‌పోతున్నార‌ట‌. ఆయ‌న టీడీపీలో ఉక్క‌పోత‌కు గుర‌వుతున్నార‌న్న విష‌య‌మే ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఏపీలో ప్ర‌స్తుతం పంచాయ‌తీ ఎన్నిక‌ల సెగ‌లు రేగుతున్నాయి. ఈ స‌మ‌యంలో ఆయ‌న సైలెంట్‌గా ఉండ‌డం పార్టీ శ్రేణుల‌కు అంతు ప‌ట్ట‌డం లేదు.

గ‌తంలో కాంగ్రెస్ పాల‌న‌లో ఐదేళ్ల పాటు మంత్రిగా చ‌క్రం తిప్పిన పితాని.. ఆ త‌ర్వాత టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి.. ఇక్క‌డ కూడా చివ‌రి రెండేళ్ల పాటు దూసుకు పోయారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయాక పితాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎన్నిక‌ల‌కు ముందే పితానికి వైసీపీ నుంచి న‌ర‌సాపురం ఎంపీ సీటు ఆఫ‌ర్ చేసినా ఆయ‌న పార్టీ మార‌లేదు. ఇక కొద్ది రోజుల క్రితం ఈఎస్ఐ స్కాంలో ఆయ‌న కుమారుడు ఇరుక్కున్నా టీడీపీ నుంచి స‌రైన స‌పోర్ట్ లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేసిన ప‌రిస్థితి.

ఇటీవ‌ల పితాని కుమారుడి పెళ్లికి వెళ్లిన చంద్ర‌బాబు ఆయ‌న్ను ఓదార్చార‌ట‌. ఇక ఆయ‌న‌కు వైసీపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయ‌ని.. ఆయ‌న కూడా వైసీపీ నుంచి స‌రైన ఆఫ‌ర్ వ‌స్తే పార్టీ కండువా మార్చేందుకు ఆస‌క్తితో ఉన్నారంటున్నారు. ఆయ‌న వైసీపీలో చేరితే ఆచంట కాకుండా నిమ్మ‌ల రామానాయుడు మీద పోటీకి పాల‌కొల్లు పంపుతార‌ని అంటున్నారు. ఆయ‌న స్వ‌గ్రామం కొమ్ముచిక్కాల కూడా పాల‌కొల్లులోనే ఉంది. పాల‌కొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు జ‌గ‌న్‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారారు.

అక్క‌డ పార్టీ బ‌లోపేతానికి ఎంత‌మందికి ప‌ద‌వులు ఇచ్చినా వ‌ర్గ పోరు ఎక్కువ అవుతోంది. ఈ క్ర‌మంలో అక్క‌డ కు పితాని వెళితే అంద‌రిని స‌మ‌న్వ‌యం చేసుకుని వెళ‌తార‌న్న‌దే వైసీపీ ప్లాన్ అట‌. మ‌రి పితాని పాల‌కొల్లు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌తారా ?  లేదా ? అన్న‌ది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: