అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌.. త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వ‌గ‌రుస్తున్న బ్రాహ్మ‌ణుల‌కు ఇప్పుడు మంచి ఛాన్స్ వ‌చ్చిప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న తూర్పు గోదావ‌రి, విశాఖ ల త‌ర్వాత స్థానంలో ఉన్న విజ‌య‌వాడ‌లో ఇప్పుడు కార్పొరేష‌న్ ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డి బ్రాహ్మ‌ణుల‌ను ప‌ట్టించుకున్న నాథుడు క‌నిపించ‌లేదు. సాక్షాత్తూ.. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ స‌హా బ్రాహ్మ‌ణులతో ముడిప‌డిన‌ కీల‌క శాఖ‌గా ఉన్న‌దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ కూడా విజ‌యవాడ‌కు చెందిన వారే.

దీంతో ఇప్పుడు విజ‌యవాడ కార్పొరేష‌న్‌లో వీరిద్ద‌రూ స‌త్త‌చూపించాలంటే.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని భ‌వానీపురం, గొల్లపూడిలోని కొంత ప్రాంతం, ఒన్ టౌన్ వంటి ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మ‌ణుల‌ను మ‌చ్చిక చేసుకోవాల్సిన అవ‌స‌రం మంత్రి వెలంప‌ల్లికి ఉంది. ఇక‌, స‌త్య‌నారాయ‌ణ పురం, మ‌ధురాన‌గ‌ర్‌, దేవీన‌గ‌ర్, అయోధ్య‌న‌గ‌ర్‌ వంటి కీల‌క ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మ‌ణుల‌ను త‌న‌వైపు తిప్పుకోవాల్సిన అవ‌స‌రం ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వీరిని ఎలా క‌లుస్తారు? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి రెండు ప్ర‌ధాన అవ‌రోధాలు క‌నిపిస్తున్నాయి. గత సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు..బ్రాహ్మ‌ణుల‌కు మ‌ల్లాది విష్ణు అనేక హామీలు ఇచ్చారు. అవేవీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేదు. ఇక‌, మంత్రి వెలంప‌ల్లి.. దేవ‌దాయ శాఖ‌లోని బ్రాహ్మ‌ణుల‌ను వ‌దిలేసి..ఇత‌ర రాజ‌కీయాలు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌ని.. వీరిని ప‌క్క న‌పెట్టాల‌ని బ్రాహ్మ‌ణులు భావిస్తే.. కార్పొరేష‌న్‌లో వైసీపీ జెండా ఎగ‌రేయ‌డం అంత ఈజీకాద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వీరు ఎలా మ‌చ్చిక చేసుకుంటార‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. వీరిని కాదంటే..టీడీపీ మ‌ళ్లీ కార్పొరేష‌న్ కైవ‌సం చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకుhttps://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా ​care@indiaherald.com​​​  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: