అనంతపురం జిల్లా గుత్తి పురపాలక సంఘం ఎన్నికలు కూడా మార్చి 10వ తేదీన జరుగుతున్నాయి.. ఈ ఎన్నికలకు సంబంధించి 14వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కూడా ఉండనుంది. అయితే ఈసారి గుత్తి పురపాలక సంఘం ఎన్నికల్లో ఎన్నడూలేని విధంగా ఎక్కువ మంది పట్టభద్రులు పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలు సైతం ఈ సారి ఎక్కువగా చదువుకున్న వారికి అందులో గ్రాడ్యుయేట్స్ కి మాత్రమే టికెట్లు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఎన్నికలకు చదువుకున్న వారి మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. నిజానికి 2011లో గుత్తి చెట్నేపల్లి మేజర్ పంచాయతీలను కలిపి ప్రభుత్వం గుత్తి మున్సిపాలిటీ గా ప్రకటించింది. 

2014లో ఈ మున్సిపాలిటీకి మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి అప్పట్లో ఎస్సీ మహిళలకు చైర్మన్ స్థానం రిజర్వు కావడంతో చైర్మన్ గా టీడీపీ తరపున ఒక మహిళ ఎన్నికయ్యారు. ఆమె ఐదేళ్ళపాటు అంటే 2019 వరకు ఈ పదవిలో కొనసాగారు. అయితే అప్పట్లో తెలుగుదేశానికి సరైన మెజారిటీ రాకపోయినా స్వతంత్రులు, ఒక వైసీపీ సభ్యుని మద్దతుతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో ఆమె చైర్మన్గా గెలుపొందారు. అందుకే వైసీపీకి మెజారిటీ వచ్చినా సరే ఆ పార్టీ చైర్మన్ పదవిని అందుకోలేకపోయింది ప్రస్తుతం మున్సిపాలిటీకి రెండో సారి ఎన్నికలు జరగబోతున్నాయి. 

ఈ నేపథ్యంలో దాదాపుగా అన్ని ప్రధాన పార్టీలు గ్రాడ్యుయేట్స్ కి టికెట్స్ ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్ధులు కూడా దాదాపుగా అందరూ గ్రాడ్యుయేట్స్ ఉండడం గమనార్హం. ఈ మున్సిపాలిటీ లో దాదాపుగా 25 వార్డులు ఉన్నాయి. 37182 మంది ఓటర్లు ఉన్నారు. ఇక విద్యావంతుల మధ్య పోటీ ఇప్పుడు రసవత్తరంగా సాగింది. ఇప్పటికే ఉదయం రాత్రి తేడా లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు. సమస్యల పరిష్కారానికి కచ్చితంగా తాము పాటు పడతామని తమకు ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ముందుకు వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: