తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ మీద దృష్టి పెట్టారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పని చేస్తున్న నేపథ్యంలో వారిని క్యాబినెట్లోకి తీసుకునే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. గత కొంతకాలంగా టిఆర్ఎస్ పార్టీ కోసం కాస్త ఎక్కువగానే కష్టపడుతున్న సదరు నేతలు మీద ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారని ఇప్పుడు ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కోసం ఉప ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఆర్ధికంగా కూడా కొంత మంది సహకారం అందించారు.

అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూడా కొంత మంది ఎమ్మెల్యేలు కష్టపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా కొంత మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా కష్టపడ్డారు. ఫలితాలు ఎలా ఉన్నా సరే వాళ్ళు మాత్రం పార్టీ కోసం చాలా వరకు ఖర్చు పెట్టడం అలాగే ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రయత్నాలు చేయడం వంటివి చేశారు. ఈ నేపథ్యంలోనే వారికి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత కేసీఆర్ కేబినేట్ లోకి తీసుకుంటారు అని అంటున్నారు. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికీ ఒక స్పష్టత కూడా ఇచ్చారని తెలుస్తోంది.

అయితే కొంతమంది కీలక నేతలను క్యాబినెట్ నుంచి పంపించే ఆలోచనలో ఆయన ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. కొంతమంది నేతలు సమర్థవంతంగా పని చేయకపోవడంతో పార్టీ ఎక్కువగా నష్టపోయింది. కొంతమందికి కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. అయినా సరే కొంతమంది సమర్థవంతంగా పని చేయలేక పోవడంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లడం లేదు. భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో కూడా చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. దీనితో సీఎం కేసీఆర్ సీరియస్ గా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది అందుకే సమర్థవంతంగా పనిచేసే వాళ్లకు మాత్రమే కేబినెట్లో చోటు కల్పించే ఆలోచనలో ఉన్నారట. అయితే మంత్రి హరీష్ రావు తో సన్నిహితంగా ఉండే ఇద్దరు మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: