తిరుపతి ఉప ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటి అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రావడం లేదు. భారతీయ జనతా పార్టీ నేతలు తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సరే ఎటువంటి పరిణామాలు ఉంటాయో కానీ తిరుపతి లో పోటీచేయడానికి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం మొత్తం కూడా ప్రయత్నాలు చేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జనసేన పార్టీ పోటీ చేస్తామని చెప్పినా తమకు బలం ఉందని నిరూపించిన సరే భారతీయ జనతా పార్టీ మాత్రం తగ్గడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు దారితీస్తున్నాయి అనే చెప్పాలి. ప్రతి అంశంలో కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూనే ఉంది. ఈ తరుణంలో బిజెపి పోటీ చేస్తే కనీసం ప్రజలు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

ఒక వేళ హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్ళినా సరే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కి కలిసివచ్చేవి ప్రత్యేకంగా ఏమీ లేవు అనే విషయం చెప్పాలి. జనసేన పార్టీ పోటీ చేస్తే తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం వలన ఉపయోగం ఏమీ లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారశైలిపై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఒకవేళ బీజేపీ పోటీ చేస్తే పరువు తీసుకోవడం మినహా మరో లాభం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: