ఇటీవలి కాలంలో దగ్గుబాటి కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరిగింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు ఎన్నో కనిపించాయి. పార్టీ మారే అంశం గురించి ఎక్కడా కూడా తమ స్పష్టతను తెలియజేయలేదు. దీంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కాలేదు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఎటువంటి లాభం ఉంటుంది అనే దాని మీద వెంకటేశ్వరరావు ఎన్నో అంచనాలు వేసుకుంటున్నారు.

కానీ అనుకున్న విధంగా ఫలితం మాత్రం తన పడే అవకాశాలు ఉండకపోవచ్చు అని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చాలామంది కీలక నేతలతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాసరే తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అనుకున్న విధంగా పరిణామాలు కనపడకపోవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీని ఆయన వదిలిపెట్టిన తర్వాత కొంతమంది నేతలు ఆయనతో విడిపోయారు. కానీ ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి ఒకవేళ ఆయన వస్తే ప్రకాశం జిల్లా నేతలు కూడా ఆయనతో కలిసి పని చేయవచ్చు అనే భావన ఉంది.

ఆయన వ్యక్తిగతంగా స్వలభావం కోసం ఎక్కువగా చూసుకుంటారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతుంటాయి. ఈ  తరుణంలో ఆయన పార్టీ మారిన ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గానీ నియోజకవర్గాల ఇన్చార్జిలు గాని ఆయనకి సహకరించే అవకాశాలు లేక పోవచ్చు అనే భావన కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ తరుణంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గనుక పార్టీ మారితే పరిణామాలు మరింత వేగంగా మారే అవకాశాలు ఉంటాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు కాస్త రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి సంబంధించి చాలామంది నేతలు వ్యతిరేకత వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: