ఈ మధ్య కాలంలో మందుబాబులకు వరుసగా షాకుల తగులుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  మద్యంధరలు భారీగా పెరిగి పోతూ ఉండడంతో మందుబాబులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే భారీగా పెరిగిన ధరలతో మద్యం కొనుగోలు చేయలేక కల్తీ మద్యానికి అలవాటు పడుతున్నారు. అయితే సాధారణంగా దేశీయ బ్రాండ్ కు సంబంధించిన ధరలు భారీగా పెరిగి పోగా ఇక విదేశీ బ్రాండ్ల పై అటు భారీగా కష్టం సుఖం కూడా వసూలు చేస్తూ ఉండడంతో విదేశీ బ్రాండ్లు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక ధరలు పెరిగాయి అంటే ఎప్పుడెప్పుడు మద్యం ధరలు తగ్గుతాయా అని అటు మద్యం ప్రియులు అందరూ కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా మద్యం ధరలు తగ్గుతాయి అని ఎదురుచూస్తున్న వారికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మద్యం ప్రియుల కోసం మంచి కిక్ ఇచ్చే ఒక వార్త సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. మరికొన్ని రోజుల్లో పలురకాల మద్యం బ్రాండ్స్  పై ధరలు తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి భారత్ మద్యం దిగుమతి చేసుకుంటుంది అన్న విషయం తెలిసింది.



 ముఖ్యంగా యూరప్ నుంచి భారీగా మద్యం దిగుమతి చేసుకుంటుంది భారత్. యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న మద్యానికి 150% కస్టమ్స్ విధిస్తూ  ఉంటుంది భారత్. కానీ ఈ కస్టమ్స్  విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం పలు రకాల బ్రాండ్ల పై కస్టమ్స్ తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూరప్ నుంచి దిగుమతి చేసుకునే పలు రకాల మధ్య బ్రాండ్లకు 150%  కస్టమ్స్ వసూలు చేస్తూ ఉండగా దానిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీనితో మరికొన్ని రోజుల్లో ఇక దేశంలో వివిధ రకాల విదేశీ బ్రాండ్లు ధరలు తగ్గే అవకాశం ఉంది అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: