మొన్నటి వరకు దేశాన్ని మొత్తం అతలాకుతలం చేసిన కరోనా వైరస్ గురించి మరిన్ని నిజాలను తెలుసుకునేందుకు ఇప్పటికీ కూడా వివిధ రకాల అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ కూడా ఎన్నో రకాల అధ్యయనాలు జరగ్గా  ప్రతి మధ్యాహ్నం లో కరోనా వైరస్ గురించి ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక అధ్యయనాల్లో  వెలుగులోకి వస్తున్న కొత్త విషయాల ద్వారా ప్రజలలో అవగాహన కూడా పెరిగిపోతుంది. అయితే కరోనా వైరస్ మనుగడ ఎలాంటి వస్తువులపై ఎక్కువగా ఉంటుంది అనే దానిపై గతంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు వివిధ రకాల అధ్యయనాలు నిర్వహించారు అన్న విషయం తెలిసిందే.




 ఈ క్రమంలోనే పలు అధ్యయనాలలో  ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా తేమగా ఉన్న ప్రాంతాలలో కరోనా మనుగడ ఎక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో నివేదికలు చెప్పాయి. ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో కూడా మరో కొత్త విషయం బయటకు వచ్చింది. అన్ని ఉపరితలాల  కన్నా మొబైల్ స్క్రీన్ ల పైనే ఎక్కువగా కరోనా వైరస్ మనుగడ ఉంటుంది అంటూ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. మొబైల్ స్క్రీన్ లపైనే కరోనా వైరస్ ఎక్కువకాలం జీవిస్తున్నట్లు ఇటీవలే ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేల్చారు.



 అయితే ఉష్ణోగ్రత గాలిలో తేమ తో పాటు అనేక అంశాలపై కూడా కరోనా వైరస్ మనుగడ ఆధారపడి ఉంటుంది అంటూ శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. గాజు ఉపరితలాల తో పోలిస్తే మొబైల్ స్క్రీన్ పై కరోనా వైరస్ ఆవిరి అయ్యేందుకు మూడు రెట్లు ఎక్కువ సమయం పడుతుందని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.  అందుకే ఎప్పటికప్పుడు మొబైల్ స్క్రీన్లను క్లీన్ చేస్తూ ఉండాలి అంటూ సూచించారు. అయితే ప్రస్తుతం మొబైల్ వాడకం అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు మొబైల్ స్క్రీన్ టచ్ చేసిన కూడా ప్రమాదం ముంచుకు వచ్చే అవకాశం ఉంది అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: