క్రాక్ సినిమా విజ‌య‌వంత‌మైంద‌నే ఆనందంలో క‌థానాయ‌కుడు ర‌వితేజ త‌న రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేశార‌నే స‌మాచారం తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఒక్క సినిమా విజ‌య‌వంత‌మైతే ఏకంగా 60 శాతం పారితోషికం పెంచిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వైపు క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోటుకుంటున్న స‌మ‌యంలో, అంద‌రికీ ఉపాధి దొరుకుతున్న స‌మ‌యంలో, అల్పాదాయ‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఆర్థికంగా ఇప్పుడిప్పుడే కుదుటప‌డుతున్న స‌మ‌యంలో వీరంతా ఎందుకు ఇలాచేస్తారో ఇప్ప‌టికీ ఎవ‌రికీ అర్థంకావ‌డంలేదు.

మ‌రోవైపు ప్ర‌తినాయ‌కు పాత్ర‌లు పోషిస్తున్న సోనూసూద్ లాంటివారు త‌మ‌కున్న ఆస్తుల‌ను సైతం అమ్మి వ‌ల‌స‌కూలీల‌ను, కార్మికుల‌ను ఆదుకుంటున్నారు. లాక్డౌన్ స‌మ‌యంలో ముఖం కూడా చూపించ‌ని క‌థానాయ‌కులు ఏదో ఒక సినిమా విడుద‌లై విజ‌యం సాధిస్తే ఎవ‌రికీ అందుబాటులో లేనంత రెమ్యున‌రేష‌న్ ఎలా పెంచుతారు?  వీరు తెర‌మీద క‌థానాయ‌కులేకానీ, నిజ జీవితంలో కాదంటూ సినీ అభిమానులే విమ‌ర్శిస్తున్నారు. రవితేజ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచ‌డంతో మారుతి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా గోపీచంద్ దగ్గరకు వెళ్లిపోయిందని స‌మాచారం.

‘క్రాక్’ సినిమాకు రవితేజ రెమ్యునరేషన్‌తో పాటు వైజాగ్ ఏరియా కలెక్షన్స్‌లో షేర్ కూడా తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా రవితేజకు బాగా క‌లిసొచ్చింది. క‌లెక్ష‌న్లు కూడా బాగానే రావ‌డంతో షేర్‌కు త‌గ్గ‌ట్లు భారీ లాభాలు ఆర్జించారు. నిజానికి ‘క్రాక్’ సినిమా కన్నా ముందే రవితేజను యూవీ క్రియేషన్స్ నిర్మాతలు సంప్రదించారట. మారుతి దర్శకత్వంలో తాము రూపొందించే సినిమాలో మొదట రవితేజను హీరోగా అనుకున్నారట. కానీ, రెమ్యునరేషన్‌ను తగ్గించుకోవడానికి రవితేజ అంగీకరించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ గోపీచంద్ దగ్గరకు వెళ్లిందని అంటున్నారు.  ప్రస్తుతం రవితేజ తన రెమ్యునరేషన్‌ను రూ.16 కోట్లకు చేర్చారని టాక్.  

24 విభాగాల‌కు సంబంధించిన సినీ ప‌రిశ్ర‌మ‌లో కార్మికులంద‌రికీ ఉపాధి దొర‌కాలి.. నిర్మాతలంతా బాగుండాల‌ని దాస‌రి నారాయ‌ణ‌రావులాంటి ద‌ర్శ‌కులు, సూప‌ర్‌స్టార్ కృష్ణ లాంటి క‌థానాయ‌కులు ప‌రిత‌పించేవారు. వారి బాగోగులు చూడ‌టం త‌మ బాధ్య‌త‌గా భావించేవారు. ఇప్పుడు ఎవ‌రి బాగోగులు వారు చూసుకోవ‌డ‌మే స‌రిపోతోంది. మిగ‌తావారి సంగ‌తి ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? అందులోను తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో..?? 

మరింత సమాచారం తెలుసుకోండి: