ఏపి లో జరిగిన పంచాయితీ ఎన్నికలు ఓ రకంగా టీడీపీ కి షాక్ ఇచ్చిన కూడా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు టీడీపీ విజయం సాధించింది అంటూ చంకలు గుద్దుకుని సంబరపడిపోతున్నారు..అందులో ఒకరు రాష్ట్ర జాతీయ కార్యదర్శి లోకేశ్ బాబు ఒకరు. ఆయన ఏం చెప్పినా కూడా అది గాల్లో మేడలు కట్టినట్లే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్నికలు పై కూడా ఆయన అలానే మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి-జగన్‌ రెడ్డి నియంతృత్వానికి మధ్య జరిగిన స్థానిక ఎన్నికల సంగ్రామంలో కొంత తేడాతో సంఖ్యా విజయం వైసీపీదైనా.. అసలు సిసలు గెలుపు టీడీపీదే అంటూ ప్రగల్భాలు పలికారు.


అంబేడ్కర్‌ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను, జగన్‌ రెడ్డి తన తాత రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారు. మన దేశానికి అర్థరాత్రి స్వాతంత్య్రం వస్తే.. నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో అర్థరాత్రి జగన్‌రెడ్డి ఫ్యాక్షన్‌ పాలిటిక్స్‌కి స్వాతంత్య్రం వచ్చింది.టీడీపీ మద్దతుతో పోటీచేసే అభ్యర్థుల్ని చంపేశారు. నామినేషన్‌ వేయకుండా కిడ్నాప్‌ చేశారు. బెదిరించారు. భయపెట్టారు. కట్టేసి కొట్టారు. అయినా వెనక్కితగ్గని టీడీపీ అభ్యర్థులు లెక్కింపులో ముందంజలో ఉంటే.. విద్యుత్‌ నిలిపేశారు. కౌంటింగ్‌ కేంద్రాలకు తాళాలేశారు. పోలీసులతో బెదిరించారు. దాడులు చేశారు.



టీడీపీ మద్దతుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్‌ పేరుతో వైసీపీ గెలుపు ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఎన్నడూ లేనివిధంగా జగన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడినా ధైర్యంగా ముందుకు సాగిన టీడీపీ శ్రేణులకు, పార్టీ కార్యకర్తలకు అభిమానులకు తల వంచి నమస్కరిస్తున్న అని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ప్రజాస్వామాన్ని ఖూనీ చేశారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇంత దారుణమైన ఎన్నికలను తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని సోషల్ మీడియా లో పేర్కొన్నాడు... లోకేశ్ పోస్ట్ పై వైసీపీ అభిమానులు అయ్యో లోకేశా.. భ్రమలోంచి బయటకు రావయ్యా.. కళలు కనడం అపేసేయి అంటూ కామెంట్లు పెట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: