భోజన ప్రియులకు ఏదైనా వంట నచ్చితే దానిని చచ్చినా వదలరు..వాళ్ళు తినే తిండి మాములుగా ఉండదు..ఒక్కసారి అలాంటి వాళ్ళు హోటల్ కు వస్తే చాలు అని చాలా మంది అనుకుంటారు. వారి వల్ల నాలుగు రోజులకు సరిపడా డబ్బులు వస్తాయి. అందుకే అలా ఫుడ్ ప్రేమికులను ఆకట్టుకోవడానికి గమ్మత్తైన పేర్లను పెడ్డటం వంటివి చేస్తుంటారు. పేర్లు నచ్చితే రుచి నచ్చుతుందని భావిస్తున్నారు. ఆ క్రమంలో గోదావరి జిల్లాలో వింత పేర్లతో హోటల్ దర్శనమిస్తాయి. ఇటీవల నా పొట్ట నా ఇష్టం అనే పేరుతో హోటల్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొట్టింది..


ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అవుతుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా దోశ ను వేస్తూ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి కొన్ని హోటల్స్.. వాటికి అలా పేరు రావడంతో చాలా మంది వాటిని తినడానికి ఇష్టపడుతున్నారు.. స్ట్రీట్‌ ఫుడ్‌ విక్రేతలు తమదైన రుచులు, స్టైల్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ముంబైలో ఇటీవల ఫ్లైయింగ్‌ దోశ వైరల్‌ వీడియో అనంతరం ఇప్పుడు రజనీ స్టైల్‌ దోశతో మరో పుడ్‌ స్టాల్‌ యజమాని నెటిజన్ల చూపును ఆకట్టుకున్నాడు.



మసాలా దోశ, మైసూర్‌ మసాలా దోశగా పేరొందిన ముంబైలోని దాదర్‌ ప్రాంతంలో ప్రముఖ ఫుడ్‌ స్టాల్‌ ముత్తు దోశ కార్నర్‌ రెప్పపాటులో దోశను తయారుచేయడం, కట్‌ చేయడం, కస్టమర్‌ ప్లేట్‌లోకి వేయడం సోషల్‌ మీడియాలో ఫుడ్‌ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది.దీనికి సంబంధించిన వీడియో పలువురిని మెస్మరైజ్ చేస్తుంది.. స్ట్రీట్‌ఫుడ్‌ రెసిపీస్‌ అనే ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో ఈ వైరల్‌ వీడియో పోస్ట్‌ అయింది. సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమాని అయిన ఫుడ్‌స్టాల్‌ యజమాని ముత్తు రజనీ స్టైల్‌లో దోశ మేకింగ్‌ను చేపడుతూ తనదైన సర్వింగ్‌ టెక్నిక్‌తో రూపొందిన వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. ఆ స్టైల్ ను ఫాలో అవ్వాలని చాలా మంది అనుకుంటారు.. నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.. అతని ఖచ్చితంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కుతాడు అని అంటున్నారు.. ఇంక ఆలస్యం ఎందుకు మీరు ఓ లుక్ వేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: