ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఉపాధ్యాయుడు లేకపోతే గొప్ప గొప్పోళ్ళు ఉండరు.వారి అక్కర్లు, అవసరాలు తీర్చాలి. అంతెందుకు మనం ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే దాని వెనకాల ఉపాధ్యాయుని హస్తం వుంది. మాతృదేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. అమ్మ నాన్న తరువాత ఒక మనిషి జీవితంలో ముందడుగు వేసేటందుకు సహాయపడే వ్యక్తి ఉపాధ్యాయుడు.ఒక మనిషికి విద్యా బుద్ధులు నేర్పి ఆ మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే వ్యక్తే ఉపాధ్యాయుడు. ఎందుకంటే సమాజంలో ఒక మనిషి ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి. అలాంటి చదువు మనకు ఉపాధ్యాయుని ద్వారానే లభిస్తుంది. కాని అలాంటి ఉపాధ్యాయులను ఈనాడు ఎవరూ గుర్తించట్లేదు.చాలీ చాలని జీతాలతో  ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని గుర్తించకపోయినా  పర్లేదు కాని వారి కష్టాన్ని గుర్తించి వారికి తగిన ప్రతి ఫలం అందేలా ప్రభుత్వం చూడాలి.


నేడు ఉపాధ్యాయునికి ఈనాడు సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి ఉందంటే అర్ధం చేసుకోండి. చాలీ చాలని జీతాలతో ఇల్లు గడవ లేని పరిస్థితి ఉపాధ్యాయునిది.సమాజానికి ఒక ఇంజనీర్ కావాలన్న, డాక్టర్ కావాలన్న, పోలీస్ కావాలన్న ఖచ్చితంగా వారి వెనకాల ఉపాధ్యాయుడు వుండాల్సిందే.గుర్తించకపోయినా పర్లేదు కాని వాళ్ళు పడ్డ కష్టానికి ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది నేటి సమాజంలో. ఎంతోమంది చదువుకొని ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు.కాని ఆ చదువు నేర్పిన ఉపాధ్యాయుడు మాత్రం పేదవాడిగానే మిగిలిపోతున్నాడు.వారికి జీతాలు పెంచాలి.ఇక చాలా మంది టీచర్లు ఇప్పుడు జీవనోపాధి లేక రోడ్డున పడ్డారు.


ముఖ్యంగా సీనియర్ ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అయితే దారుణంగా వుంది. చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్పుకోలేని పరిస్థితి వారిది ఇప్పుడు. ఇక వారికి ప్రతినెలా ప్రభుత్వం ఖచ్చితంగా ఫించన్ ఇవ్వాలి.ఇక టీచర్లు కొంతమంది అయితే వారి పిల్లల చదువులు గాని అలాగే పెళ్లిళ్లు గాని చెయ్యలేని పరిస్థితిలో వున్నారు.ఇక చాలా మంది టీచర్ల కుటుంబాలు అయితే ఆసుపత్రి పాలైనప్పుడు మందులకి చికిత్సలకి డబ్బులు కట్టలేని పరిస్థితిలో వున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే సరిగ్గా వైద్యం అందించకుండా ఏం పట్టించుకోవట్లేదు.. అందువల్ల ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందాలనుకునే వారికి ఆర్థిక ఇబ్బందులు వల్ల ఎన్నో అవస్థలు పడుతున్నారు టీచర్లు. కాబట్టి ప్రభుత్వం టీచర్లకి వారి కుటుంబాల ఆసుపత్రి ఖర్చులు భరించాలి... ఇక ఇలాంటి మరెన్నో విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: