భార‌త‌దేశంలో పెట్రోలు ధ‌ర‌లు రోజురోజుకు ఆకాశ్శాన్నంటుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌తను ఎదుర్కొంటోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, హోంమంత్రి అమిత్ షాపై ఒత్తిడి రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలో వారి సొంత రాష్ట్రం గుజ‌రాత్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు భార‌తీయ జ‌న‌తాపార్టీకే ప‌ట్టం క‌ట్టారు. అసెంబ్లీ, లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల్లో ఓటువేయ‌డంవేరు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌డం వేరు అని ప్ర‌జ‌లు మ‌రోమారు నిరూపిస్తున్నారు.

నూత‌నంగా ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్న రైతులు ఒక‌వైపు, పెరిగిన పెట్రో ధ‌ర‌లు మ‌రోవైపు ఉండ‌గా పంజాబ్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తాపార్టీ ఘోర‌ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి పంజాబ్‌లో పూర్తి ప‌ట్టుంది. దీనికితోడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు కూడా క‌లిసిరావ‌డంతో బీజేపీ చావుదెబ్బ తింది.  పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఫ‌లితాలైతే వ‌చ్చాయో గుజ‌రాత్‌లో బీజేపీకి కూడా అలాంటి ఫ‌లితాలే వ‌స్తున్నాయి.  దేశంలో రోజురోజుకూ పెరుగిపోతోన్న పెట్రోల్, డీజిల్ రేట్లు.. ఇదివరకెప్పుడూ లేనంత అధ్వాన్నపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందనే విమర్శలు.. బీజేపీ దగ్గరికి కూడా చేరలేకపోయాయనే విషయాన్ని గుజరాత్ మున్సిపల్ ఎన్నికలు స్పష్టం చేశాయి. నిత్యావసర సరుకులు, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రతికూల ప్రభావం.. బీజేపీ విజయాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లంటే స్థానికంగా ఉండే స‌మ‌స్య‌ల‌ను మాత్ర‌మే చూస్తామ‌ని ప్ర‌జ‌లు స్ప‌ష్టం చేసిన‌ట్లైంది. కమలనాథుల ఓటుబ్యాంకును కేంద్ర ప్ర‌భుత్వ విఫ‌ల బ‌డ్జెట్ కానీ, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లుకానీ దెబ్బ‌తీయ‌లేక‌పోయాయ‌ని ఈ ఎన్నిక‌ల‌నుబ‌ట్టి స్ప‌ష్ట‌మైంది.

అహ్మదాబాద్, రాజ్‌కోట్‌, వ‌డోద‌ల‌, జామ్‌న‌గ‌ర్‌, భావ్‌న‌గ‌ర్‌, సూర‌త్ మున్సిపల్ కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల్లో బార‌తీయ జ‌న‌తాపార్టీ ఘన విజయాన్ని అందుకుంది. రాజ్‌కోట్, జామ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతాను కూడా తెరవలేకపోయింది.  అహ్మదాబాద్‌లో బీజేపీ-80వార్డుల‌ను, కాంగ్రెస్-20వార్డులు, సూరత్‌లో బీజేపీ-56వార్డులు, కాంగ్రెస్-8వార్డులు, వడోదరలో బీజేపీ-41వార్డులు, కాంగ్రెస్-7వార్డులు, రాజ్‌కోట్‌లో బీజేపీ-48వార్డులు, కాంగ్రెస్-0, జామ్‌నగర్‌లో బీజేపీ-28వార్డులు, కాంగ్రెస్-0, భావ్‌నగర్‌లో బీజేపీ-32, కాంగ్రెస్-8 వార్డుల్లో విజ‌యాలు సాధించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: