ఆంధ్రప్రదేశ్ లో నాడు నేడు కార్యక్రమాన్ని ఏపీ సర్కార్ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే ఈ విషయంలో రాష్ట్ర సర్కార్ వెనక్కు తగ్గడం లేదనే చెప్పాలి. సిఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఈ కార్యక్రమాన్ని అధికారులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. విద్యా వ్యవస్థలో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా అమలు జరుగుతుంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అవినీతి ఆరోపణలు వచ్చినా సరే విద్యా శాఖ విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు.

ఇక ఇదిలా ఉంటే కాసేపటి క్రితం ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. నాడు నేడు కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుంది అని అన్నారు. ఇప్పటి వరకు 2570 కోట్ల రూపాయలకు నిదులు వెచ్చించాం అని ఆయన పేర్కొన్నారు. గతంలో స్కూల్ టెండర్స్ లో అవినీతి జరిగింది అని ఆరోపించారు. నామినేషన్ పద్దతిలో సన్నిహితులకు కట్టబెట్టారు అని మండిపడ్డారు. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా రివర్స్ టెండరింగ్ ద్వారా మెటీరియల్ కొనుగోలు చేస్తున్నాం అని తెలిపారు.

1100 కోట్ల రూపాయల విలువ మెటీరియల్ కొనుగోలులో రివర్స్ టెండరింగ్ ద్వారా 240 కోట్లు రూపాయలు ఆదా అయ్యాయి అని ఆయన వివరించారు. దేశ చరిత్ర లో ఎక్కడా లేని విధంగా స్కూల్స్ కోసం 7 నెలల్లో 2570 కోట్లు రూపాయలు ఖర్చు చేశాం అని ఆయన పేర్కొన్నారు. ప్రోక్యూర్మెంట్ లో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమే అని, వారం పది రోజుల్లో సప్లై ఐటమ్స్ అన్ని అందుతాయి అని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్ లోపు పనులు అన్ని పూర్తి చేస్తాం అని స్పష్టం చేసారు. సప్లై ఐటమ్స్ అందినా పెయింటింగ్స్ కారణంగా టివిలు లాంటివి ఫిక్స్ చేయలేదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: