పంచాయితీ ఎన్నికల కారణంగా ఏపీలో కరోనా వ్యాక్సిన్ విషయంలో వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. అయితే పంచాయితీ ఎన్నికల తర్వాత మాత్రం  స్పీడ్ పెంచారు. కరోనా వ్యాక్సిన్ ని అందరికి అందించే లక్ష్యంతో ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. ఇక పంచాయితీ ఎన్నికలతో కోవిడ్ వ్యాక్సినేషన్ త్యాగం చేసిన పోలీసులకు ఈరోజు నుంచీ వ్యాక్సినేషన్ వేస్తున్నారు. విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా కాలం మొత్తంలో అందరు పోలీసులు కష్టించి పనిచేసారుఅని అన్నారు.

నాలుగు వందల మందికి కరోనా సోకింది అని తెలిపారు. ఇద్దరు పోలీసులను కమీషనరేట్ పరిధిలో కోవిడ్ కారణంగా కోల్పోయాం అని ఆయన అన్నారు. కరోనా నిబంధనలు కచ్చితంగా అనుసరించాలి అని ఆయన వివరించారు. మనందరికీ కోవీ షీల్డ్ ఇస్తున్నారు అని అన్నారు. వ్యాక్సినేషన్ తీసుకుంటే అయ్యే రిస్క్ కంటే కోవిడ్ సోకితేనే రిస్క్ ఎక్కువ అని ఆయన వివరించారు. వ్యాక్సినేషన్ కు ముందు మొత్తం హెల్త్ ప్రొఫైల్ తీసుకుంటారు అని, కమీషనరేట్ లో వ్యాక్సినేషన్ తీసుకున్న పోలీసులకు ఒకరోజు సెలవు ఉంటుంది అన్నారు.

50 సంవత్సరాల వయసు దాటిన వారు కచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి అని స్పష్టం చేసారు. కృష్ణాజిల్లా కలెక్టర్, ఇంతియాజ్ మాట్లాడుతూ... మార్చి 23, 2020న మన జిల్లాలో మొదటి కేసు వచ్చింది అని, కోవిడ్ విధానాలు అనుసరించడంతో నియంత్రించాం అని తెలిపారు. కోవిడ్ తగ్గిందనే ఆలోచన వద్దు అన్నారు. నిర్లక్ష్యం వద్దు... ఇంకా కోవిడ్ తో యుద్ధం ఆగలేదు అని హెచ్చరించారు. దేశాల బార్డర్లు మూయబడుతున్నాయి అని, భారతదేశంలోనే వ్యాక్సినేషన్ కి చాలా ప్రాధాన్యత ఉంది అని తెలిపారు. 25 ఐజీజీ స్ధాయిలో యాంటీ బాడీస్ వ్యాక్సినేషన్ వల్ల తయారవుతున్నాయి అని వివరించారు. అందరికీ మంచి చేయాలంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అని కోరారు. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ రేపటి రోజున ఆధార్ లా మారుతుంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: