పెట్రోల్ ధరల విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గక పోతే మాత్రం త్వరలో భారీ ఉద్యమాలు జరిగే అవకాశాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరల పెంపుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి విపక్షాలు. పెట్రోల్ ధరలు తగ్గించడం మానేసి కేంద్ర ప్రభుత్వం అనేక వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. దీని వలన ప్రజలు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఆటో అలాగే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే చెప్పాలి.

ఈ నేపథ్యంలోనే త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు చేయడానికి నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడుతుందో తెలియదు కానీ ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గక పోతే మాత్రం అన్ని వర్గాల్లో కూడా తీవ్ర ఆగ్రహం సరిపోతుంది. ధరల పెంపు దెబ్బకు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో లేనివిధంగా ధరలు పెరిగిపోతున్నాయి. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు అంటే మాత్రం వచ్చే సమస్యలు ఊహకు కూడా అందే అవకాశం ఉండదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: