తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు  ఎవరూ ఊహించని విధంగా రాజకీయ పార్టీ పెట్టేందుకు వైయస్ షర్మిల సిద్ధమైంది అనే విషయం తెలిసిందే. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తీసుకు వస్తాను అంటు వైయస్ షర్మిల చెప్పుకొచ్చారు. ఇక వైయస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నట్లు  ప్రకటన చేసినప్పటి నుంచి కూడా తెలంగాణ రాజకీయాలలో  షర్మిల పెట్టబోయే రాజకీయ పార్టీ గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే షర్మిల రాజకీయ పార్టీ పేరును ఎప్పుడు ప్రకటించబోతున్నారు  అన్న దానిపై మాత్రం ఇంకా సరైన స్పష్టత రాలేదు అనే విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం షర్మిల పార్టీ ఏంటి అన్న దానిపై తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర చర్చలు  కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు పాత వైసిపి నాయకులు అందరూ కూడా షర్మిల వెంట ఉంటున్నారు. అయితే పార్టీ పెట్టబోతున్నట్లు షర్మిల సంకేతాలు ఇచ్చిన ఇచ్చిన  నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి  ఎవరైనా షర్మిల  పార్టీలో కి వెళ్తారా లేదా ఇతర పార్టీల నేతలు వైయస్ షర్మిల పెట్టబోయే పార్టీ వైపు మొగ్గు చూపుతారా అన్నది కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిపోయింది.



 అయితే షర్మిల పార్టీ పెట్టనున్నట్లు  సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో షర్మిల పార్టీలోకి ఇప్పటి వరకు ఇతర పార్టీల గురించి అసలు ఎవరు వెళ్లలేదు అని అనుకుంటున్న తరుణంలో ఇటీవలే ఓ నేత  అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాడు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజేంద్రనగర్ సర్కిల్ కు చెందినటువంటి టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కె ఎస్ దయానంద్ ప్రకటించారు. ఇక  రాజీనామా పత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కూ పంపించారు. ఇక త్వరలో పార్టీ పెట్టబోతున్న షర్మిల పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇది టిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: