దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రమాదకరంగా మారింది. పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ ఘడ్,మధ్య ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలలో పంజా విసురుతోంది.రోజు రోజుకు దేశంలో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో ప్రస్తుతం విజృంభిస్తున్న కోవిడ్ పై కొత్త విషయాలు వెలుగులోనికి వచ్చాయి. కోవిడ్ వైరంట్  N44OK తన ఉగ్రరూపాన్ని చూపిస్తోందని తెలుస్తోంది.

దేశంలో కరోనా కొత్త రకాల వ్యాప్తిపై కేంద్రం వివరాలు తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 187 మందిలో యూకే స్ట్రెయిన్ గుర్తించినట్టు వెల్లడించింది. ఆరుగురిలో దక్షిణాఫ్రికా స్ట్రెయిన్, ఒకరిలో బ్రెజిల్ రకం కరోనా గుర్తించినట్టు వివరించింది. మహారాష్ట్రలో ఎన్440కే, ఈ484కే వేరియంట్లు ఉన్నాయని తెలిపింది.
ఎన్440కే, ఈ484కే వేరియంట్లు కేరళ, తెలంగాణలోనూ ఉన్నాయని, అయితే మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండడానికి ఈ రెండు వేరియంట్లే కారణమని చెప్పలేమని కేంద్రం పేర్కొంది.

రెండవ దశ కోవిడ్ కు సంబంధించి సిసిఎంబి శాస్త్రవేత్తలు  చేసిన పరిశోధనలో  కోవిడ్ వైరంట్  N44OK దక్షిణాదిలో శర వేగంగా విస్తరిస్తోందని సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. వైరంట్ రూపాంతరం చెందుతోందని దీనిని పూర్తిగా అధ్యయనం చేయడానికి క్షుణ్ణంగా  గమనించాలని శాస్త్రజ్ఞులకు సూచించారు.

కోవిడ్ 1 9 రెండవ దశ తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది అని  కేంద్ర నివేదికలు చెపుతున్నాయి. 17 రోజుల తరువాత దేశంలో మరోసారి యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నరను దాటింది. నవంబర్ నెలలో 24వ తేదీన 4,38,667 యాక్టివ్ కేసులు ఉండగా, ఆ సంఖ్య మూడు రోజుల్లో 3.85 శాతం పెరిగి 4.55 లక్షలను దాటాయి.  గత వారంలో 1.5 శాతం ఉన్న ఈ పెరుగుదల, ఇప్పుడు 2.9 శాతాన్ని దాటింది. ఇక రోజువారీ కొత్త కేసుల సంఖ్య విషయంలోనూ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 16న 9,121గా ఉన్న రోజువారీ కొత్త కేసుల సంఖ్య, ఏడు రోజుల సగటును దాటి 13.8 శాతం పెరిగి సోమవారం నాడు 14,199కి పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: