ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ స్టార్టింగ్ లో మంచి సాలిడ్ హిట్లని అందుకున్నాడు.తరువాత తన అన్న మెగాస్టార్ చిరంజీవి సొంతగా ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది.. ఆ పార్టీ తరపున పవన్ కళ్యాణ్ అప్పుడు ఒక రేంజిలో ప్రచారాలు చేశాడు. చాలా కష్టపడ్డాడు. తరువాత చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక తన అన్న తీసుకున్న ఈ నిర్ణయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏమాత్రం నచ్చలేదు. ఇక అప్పుడు రాజకీయాల గురించి ఆలోచించడం మానేసి మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఎన్నో ప్లాపులు ఎదుర్కున్నాడు కూడా. తరువాత రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి పీక్స్ లో వున్న స్టేజ్ లో పవన్ తన సొంతంగా జనసేన పార్టీని స్థాపించాడు.జనాలకి తన తరపున ఎంతో కొంత సేవ చెయ్యడానికి పవన్పార్టీ పెట్టినట్లు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.ఇక ప్రస్తుతం అటు రాజకీయాలతో పాటు ఇటు వరుసగా సినిమాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు...


ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్య పంచాయతి ఎన్నికలు హోరా హోరీగా జరిగిన సంగతి తెలిసిందే....పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోరికని ప్రకాశం జిల్లాలోని జనసేన కార్యకర్తలు నెక్స్ట్ అసెంబ్లీలోనే ప్రూవ్ చెయ్యాలి. ఎందుకంటే రాజోలు లో జనసేన తరపున పోటీ చేసి గెలిచి మళ్ళీ పార్టీ మారిన వారికైతే రుచి చూపించారు జనసేన శక్తిని. అలాగే తాడేపల్లి గూడెంలో కూడా నిరూపించారు. అయితే గిద్దలూరులో పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది. గిద్దలూరు ఎమ్మెల్యే ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సవాల్ చెయ్యడం జరిగింది.పాతాలంలోకి తొక్కేస్తే నీ సంగతి ఏంటో తెలుస్తా అని అన్నీ చూస్తా అని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది..దాన్ని ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు రైజ్ చేస్తున్నారు.

ఇక అక్కడ 95 పంచాయితీలకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 84 ఇక తెలుగు దేశం పార్టీ 8 ఇండిపెండెంట్స్ 3 గెలుచుకున్నారు.ఇక 2009 లో 294 అసెంబ్లీ స్థానాలలో 18 స్థానాలలో పి ఆర్ పి గెలిచిన దాంట్లో గిద్దలూరు కూడా వుంది..ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన రాజకీయ వార్తలు, ఇంకా సినిమా వార్తలు ఇంకా ప్రపంచంలో జరిగే ఏ వార్తల గురించి అయినా తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: