తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్యకాలంలో స్పీడ్ గా నే రాజకీయం చేస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే విషయంలో ఆయన చాలా వరకు సమర్థవంతంగా పని చేస్తున్నారు. అయితే కొంత కొంత మంది నేతలు విషయంలో ఆయన ముందడుగు వేయలేకపోతున్నారు అనే భావన ఉంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు రాష్ట్ర స్థాయిలో విమర్శలు రాష్ట్ర స్థాయిలో మంత్రులను టార్గెట్ చేయడం వంటివి జరుగుతున్నాయి.

అయితే నియోజకవర్గాల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా బిజెపి రాష్ట్ర నాయకత్వం టార్గెట్ చేసిన పరిస్థితి లేదని చెప్పాలి. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. కానీ నియోజకవర్గం స్థాయి నాయకత్వంను విమర్శించే విషయంలో బిజెపి ఎందుకు వెనకడుగు వేస్తుంది అనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే దీనిపై బీజేపీ నేతలే స్వయంగా కొన్ని ప్రకటనలు కూడా కొంత మంది వద్ద చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి బలం గా ఉన్నారని కాబట్టి ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం కంటే కూడా ఆయనను చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయడం ద్వారా ఎమ్మెల్యేల్లో కాస్త భయాన్ని నెలకొల్పవచ్చు అనే భావనను కొంతమంది బిజెపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని... సీఎం కేసీఆర్ కూడా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. మరి ఈ రాజకీయం భారతీయ జనతాపార్టీకి ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేయడం వెనుక బండి సంజయ్ వ్యూహంపై మాత్రం ఆసక్తికర చర్చలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: