ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా సరే ఇప్పుడు మాత్రం కొన్ని కొన్ని సమస్యలు ముఖ్యమంత్రి జగన్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రధానంగా కొన్ని సమస్యల విషయంలో ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత మందికి ఆయన అపరిమిత అధికారాలు ఇచ్చేశారు. దీంతో పలు జిల్లాల్లో కొంతమంది నేతలు చేస్తున్న రాజకీయం ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి.

తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో పోలీసులను ఎక్కువగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని కారణంగా వైసీపీ ఎక్కువగా నష్టపోతుందని అంటున్నారు. వైసీపీ నేతల్లో కూడా చాలామంది ఈ విధానాల పై ఆగ్రహంగా ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు సైలెంట్ గానే ఉంటున్నారు. అయితే కొంత మంది మంత్రులను చూసి మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో రెచ్చిపోతున్నారు. పలు జిల్లాల్లో జరుగుతున్న ఈ రాజకీయంపై తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బహిరంగ విమర్శలు చేస్తున్నది.  పోలీసులను ఇలాగే వాడుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు.

 పోలీసులు కనుక ప్రజల మీద ప్రతాపం చూపితే ప్రజలు ఎన్నికల సమయంలో ప్రజలు ప్రతాపం చూపించే అవకాశం ఉంటుందని కాబట్టి పోలీసులు విషయంలో అది మంచిది కాదు అని సూచిస్తున్నారు. విపక్షాల మీద పోలీసులను ఉపయోగించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే మంచిది అని సూచన చేస్తున్నారు. ఇదే రాజకీయం భవిష్యత్తులో కూడా కొనసాగితే... అది తెలుగుదేశం పార్టీ కూడా చేస్తే ఏ విధంగా ఇబ్బందులు పడతారో ఒకసారి గ్రహించి దానిపై అడుగులు వేస్తే మంచిది అని కోరుతున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది మంత్రులు కూడా కొంతమంది మీద ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారట. ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేయడానికి మంత్రులు సిద్ధమయ్యారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: