అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.. ఒకరకంగా ప్రధాన పోటి వైసీపీ - టీడీపీ వర్గాల మధ్య నెలకొని ఉంది.. అభివృద్ధి చేసి చూపిస్తామని వైసిపి నాయకులు ప్రచారం చూస్తూ వెళ్తుంటే నేను ఇప్పటికే అభివృద్ధి చేశాను ఆదర్శంగా తీర్చిదిద్దానని మళ్లీ గెలిపిస్తే మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతాను అంటూ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో చెబుతున్నారు. అయితే ఆయన నినాదం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. "మన ఊరు మనం కాపాడుకుందాం" అనే నినాదంతో ఆయన ప్రచారంలోకి వెళ్తున్నారు. ఒక రకంగా ఆ రెండు పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక జెసి ప్రభాకర్ రెడ్డి తన నానో కారును ప్రచార రధంగా తయారు చేయిస్తున్నారు. ఈ మొత్తం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ నానో ప్రచార రథం ద్వారా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఇక నిజానికి రెండు పార్టీలకు సంబంధించి భారీ ఎత్తున రెబల్ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.. అయితే నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉండటంతో ఎలా అయినా సరే వారి చేత నామినేషన్లు ఉపసంహరింప చేసేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు..

ఇక వైసిపి కి సంబంధించిన కొంత మంది రెబల్ అభ్యర్థులు తమకు వైసీపీ నుంచి బీఫామ్ రాకపోతే టిడిపిలో చేరి టీడీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేయడంతో టీడీపీ చైర్మన్ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి అనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు కూడా వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తుండడంతో వైసీపీ నుంచి ఆయన చైర్మన్ అభ్యర్థి అని ప్రచారం జరుగుతోంది.. ఇక తాడిపత్రి ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి..

మరింత సమాచారం తెలుసుకోండి: