గడిచిన పల్లె పోరులో పూర్తిగా వన్ సైడ్ వార్ నడిచిందని చెప్పాలి. దీనికి తార్కాణమే జగనోరికి పల్లెలిచ్చిన ఘనమైన తీర్పు. ఇక ఈ తీర్పుతో బాబోరి పరిస్థితి తలకిందులయిపోయింది.  ఆఖరికి తన సొంత నియోజకవర్గంలో కూడా తన మంత్రం పనిచేయలేదంటే చూడండి, బాబోరిపై ఏ స్థాయిలో ప్రజాగ్రహం ఉందో.. కుప్పం నియోజకవర్గంలో ఉన్న 89 గ్రామ పంచాయతీలకుగానూ కేవలం 14 గ్రామ పంచాయతీలు మాత్రమే టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. మిగిలిన 75 పంచాయతీలు వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం ఒక రికార్డు అని చెప్పుకుంటున్నారు ప్రజలు.

ఈ తీర్పుతో బాబోరి పని అయిపోయిందని ఒక అంచనాకు వచ్చేశారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు ఈ మాటే రెండు తెలుగు రాష్ట్రాలలో కోడై కూస్తోంది. అయితే ఒక వైపు టీడీపీ నాయకులు మరియు బాబోరు ఎన్నికల కౌంటింగ్ సరిగా జరగలేదని, దౌర్జన్యంతోనే వైసీపీ అభ్యర్థులు గెలిచారని గంటకో వివాదాన్ని ముందుకు తీసుకు వచ్చి అటు ఎన్నికల సంఘాన్ని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేశారు. ఓ వైపు స్వయంగా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎన్నికల కౌంటింగ్ లో ఎటువంటి జాప్యం జరగలేదని ప్రెస్ నోట్ ఇచ్చారు. కనీసం అప్పుడయినా వీరంతా ఆగుతారా అంటే అదీ జరగలేదు.

ప్రస్తుతం బాబోరి తనయుడు లోకేష్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్ పై దుర్భాషలాడారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ చేయని దౌర్జన్యాలు లేవని లోకేశ్‌ ధ్వజమెత్తారు.  పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్‌ తొక్కని అడ్డదారులు లేవు. విజయనగరం జిల్లా, కొత్తవలస గ్రామ పంచాయతీలో టిడిపి బలపర్చిన అభ్యర్థి 260 ఓట్ల గెలిచినా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడితో వైకాపా గెలిచినట్టు ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు కొంతమంది అధికారులు. ఇప్పటికైనా వీటిపై ఎస్ఈసి చర్యలు తీసుకోవాలని లోకేష్ అభ్యర్థిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: