రాజకీయాల్లో సంచలనాలకు మారు పేరుగా మారిన టిడిపి సీనియర్ నేత మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి. జెసి దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన పూర్తి పేరు జూటూరు చిన దివాకర్ రెడ్డి. ఈయన 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అనంతపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు.


 దివాకర్ రెడ్డి  ఇప్పటివరకు ఆరు సార్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. ఐదుసార్లు తాడిపత్రి నుంచి ఎన్నికయ్యారు.  2004 -2006లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. రాష్ట్ర విభజన ముందు వరకు కాంగ్రెస్ లో ఉన్న ఈయన విభజన తరువాత టీడీపీ లోకి వచ్చారు.  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మరోసారి టీడీపీ కీలక నేత జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుసుకుందాం.

 రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా మారిన టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఆయన ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదాయం పై కామెంట్ చేయడం సంచలనంగా మారింది. మంగళవారం నాడు అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఒక రోజు ఆదాయం 300 కోట్లు అని షాకింగ్ కామెంట్ చేశారు.


 అయితే ఇది ఎంతవరకు నిజమో అబద్దమో తెలియ లేదన్నారు. ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న అంశాన్ని తాను చెబుతున్నానన్నారు జేసీ దివాకర్ రెడ్డి. ప్రతి ఎన్నికల్లో డబ్బు ప్రభావం తోనే ఎన్నికల్లో జగన్ గెలుస్తారని చెప్పారు.  టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బాగా అభివృద్ధి చేశారని,డబ్బులు పంచలేకే ఓడిపోయారాన్నారు. అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా భయబ్రాంతులకు గురిచేసారన్నారు. అభివృద్ధి చూసి వైసిపికి ఓటే శారని చెప్పడం అపద్దామని జేసీ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: